Viral News: టీచరమ్మా.. పాఠాలు చెప్పకుండా ఇదేం పాడుపని.. విద్యార్థితోనే..
ABN, Publish Date - Jul 01 , 2024 | 06:27 PM
పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచరమ్మా దారి తప్పింది. ఓ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుంది. తాను కోరినప్పుడల్లా అతనితో కామవాంఛ తీర్చుకుంది. ఈ వ్యవహారం ఎలాగోలా బయటకు పొక్కడంతో..
పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచరమ్మా దారి తప్పింది. ఓ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుంది. తాను కోరినప్పుడల్లా అతనితో కామవాంఛ తీర్చుకుంది. ఈ వ్యవహారం ఎలాగోలా బయటకు పొక్కడంతో.. పోలీసులు రంగప్రవేశం చేశారు. మైనర్‌తో రిలేషన్ పెట్టుకున్నందుకు ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలోని (America) న్యూజెర్సీలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
న్యూజెర్సీలోని ఫ్రీహోల్డ్ ఇంటర్మీడియట్ పాఠశాలలో ఎలీసన్ హవెమాన్ అనే మహిళ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేస్తోంది. ఆమె వయసు 43 సంవత్సరాలు. కొన్నేళ్ల నుంచి ఆ స్కూల్‌లో పని చేస్తున్న ఆమెకు మంచి ఉపాధ్యాయురాలిగా పేరుంది. కానీ.. ఈ ఏడాది ప్రారంభం నుంచి మైనర్ అయిన ఓ విద్యార్థిని ఆమె లైంగికంగా వేధిస్తోందనే విషయం ఇటీవల బయటకు పొక్కింది. అతనితో ఆమె తన కామకోరికలు తీర్చుకునేదని, ఎప్పుడుపడితే అప్పుడు పిలుపించుకొని సరసాసల్లాపాల్లో పాల్గొనేదని వెలుగులోకి వచ్చింది.
ఈ సమాచారం అందడంతో.. పోలీసులు వెంటనే రంగంలోకి ఆ టీచరమ్మని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె మాన్‌హట్టన్ కౌంటీ జైలులో ఊచలు లెక్కపెడుతోంది. అయితే.. ఈ విషయం ఎలా బయటకొచ్చిందో ఎవ్వరికీ తెలీదు. ఆ అబ్బాయి వివరాలు కూడా వెల్లడించలేదు. ఆమె 6 నుంచి 8వ గ్రేడ్ విద్యార్థులకు పాఠాలు చెప్తుంది కాబట్టి.. ఆ విద్యార్థి వయసు 14 ఏళ్లలోపే ఉండొచ్చని తెలుస్తోంది. ఆమె కార్యకలాపాల గురించి తెలిసిన వాళ్లుంటే, ముందుకు రావాలని ప్రాసిక్యూటర్ కార్యాలయం పిలుపునిచ్చింది.
అయితే.. టీచర్ తరఫు లాయర్ మాత్రం తన క్లయింట్ నిర్దోషి అని, ఎలా తప్పు చేయలేదని చెప్తున్నారు. మరోవైపు.. లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో ఎలీసన్ తనను తాను ఎంతో మంచి టీచర్‌గా పేర్కొంది. 2008 నుంచి తాను టీచర్‌గా పని చేస్తున్నానని, తానో ప్యాషనేట్ ఉపాధ్యాయురాలినని తన ప్రొఫైల్‌లో రాసుకొచ్చింది. కాగా.. 2022 నుంచి ఆమె ఫ్రీహోల్డ్ స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేస్తున్నట్టు తెలిసింది.
Read Latest Viral News and Telugu News
Updated Date - Jul 01 , 2024 | 06:27 PM