ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఇలాంటోళ్లతో ఎప్పటికైనా రిస్కే! బాయ్‌ఫ్రెండ్ పొరపాటుతో తిక్కరేగి..

ABN, Publish Date - Jun 21 , 2024 | 05:49 PM

ఇచ్చిన మాట ప్రకారం తనను ఎయిర్‌పోర్టు వద్ద దిగబెట్టకుండా మాటతప్పిన బాయ్‌ఫ్రెండ్‌పై ఓ మహిళ కోర్టులో కేసు వేసింది. అయితే, ఆ జంట మధ్య కుదిరిన మౌఖిక ఒప్పందానికి చట్టబద్ధత లేదంటూ కోర్టు ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది.

ఇంటర్నెట్ డెస్క్: బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ తాము ఇచ్చిన మాట తప్పితే ఎవరైనా కాస్తంత హర్ట్ అవుతారు. రెండు మూడు రోజులు మాట్లాడటం మానేస్తారు. మరీ హర్ట్ అయితే వాళ్లకు శాశ్వతంగా దూరమవుతారు. కానీ ఓ మహిళ ఇవేమీ చేయకుండా తన బాయ్‌ఫ్రెండ్‌ను కోర్టుకు ఈడ్చింది. తనకు ఇచ్చిన మాట తప్పి నష్టం కలిగించాడని ఫిర్యాదు చేసింది. న్యూజిలాండ్‌లో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది.

Viral: ఇంటి బయట కూర్చున్న మహిళకు ఊహించని షాక్! సడెన్‌గా గోడపై నుంచి..

పూర్తి వివరాల్లోకి వెళితే, న్యూజిలాండ్‌కు చెందిన ఓ మహిళ ఆరేళ్లుగా తన బాయ్‌ఫ్రెండ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఇటీవల ఆమె ఓ కాన్సర్ట్‌లో పాల్గొనేందుకు విమానం టిక్కెట్లు బుక్ చేసుకుంది. తాను లేనప్పుడు తన పెంపుడు కుక్కలను చూసుకునే బాధ్యత కూడా బాయ్‌ఫ్రెండ్‌కే అప్పగించింది. ప్రయాణం రోజు సరిగ్గా ఉదయం 10 గంటలకు వచ్చి తనను కారులో ఎయిర్‌‌పోర్టు వద్ద దిగబెట్టమని చెప్పింది. కానీ ఆ రోజు బాయ్‌ఫ్రెండ్ హ్యాండివ్వడంతో మహిళకు భారీ షాక్ తగిలింది. అమె ప్రయాణం మరో రోజుకు వాయిదా పడటంతో పాటు విమానం టిక్కెట్ల డబ్బును కోల్పోవాల్సి వచ్చింది (New Zealand Woman Takes Legal Action Against Boyfriend For Skipping Airport Drop off).


బాయ్‌ఫ్రెండ్ చేసిన పనిని యువతికి తిక్కరేగడంతో అతడిపై ఏకంగా కోర్టులో కేసు వేసింది. తమ మధ్య జరిగిన మౌఖిక ఒప్పందాన్ని అతడు ఉల్లంఘించాడని ఆరోపించింది. బాయ్‌ఫ్రెండ్‌ తనకు విమానం టిక్కెట్లు డబ్బులు ఇవ్వడంతో పాటు మరికొంత పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అయితే, కోర్టు మాత్రం ఆమె వాదనను పూర్తిగా తిరస్కరించింది. వారి మధ్య చట్టపరంగా అమలు చేయదగిన ఒప్పందం ఏదీ కుదరనందుకు ఈ విషయంలో తాము చేయగలిగింది ఏమీ లేదని కొర్టు కుండబద్దలు కొట్టింది.

ఈ ఉదంతం నెట్టింట వైరల్ కావడంతో మహిళ చేసిన పనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె చేసింది సబబే అని అంటే మరికొందరు మాత్రం ఇలాంటోళ్లతో వేగడం కష్టమేనని కామెంట్ చేశారు.

Read Viral and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 05:49 PM

Advertising
Advertising