ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: పాములే లేని ఈ దేశం గురించి తెలుసా?

ABN, Publish Date - Apr 20 , 2024 | 06:50 PM

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఒక్క పాము కూడా లేని ఆ దేశం పేరు న్యూజిలాండ్. దేశ భౌగోళిక లక్షణాల రీత్యా ఒక్క పాము కూడా అక్కడ కాలు పెట్టలేకపోయింది.

ఇంటర్నెట్ డెస్క్: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఒక్క పాము కూడా లేని ఆ దేశం పేరు న్యూజిలాండ్ (NewZealand). దేశ భౌగోళిక లక్షణాల రీత్యా ఒక్క పాము కూడా అక్కడ కాలు పెట్టలేకపోయింది. న్యూజిలాండ్ చుట్టూరా ఉన్న సముద్రంలోని కొన్ని ద్వీపాల్లో పాములు ఉన్నా అవి ఈ జలరాశిని దాటుకుని న్యూజిలాండ్‌లోకి కాలుపెట్టలేకపోయాయి (No snakes).

Isha Arora: ఎవరీ ఓవర్‌నైట్‌ స్టార్‌ ఇషా.. మేడమ్‌ను మెచ్చుకోవాల్సిందే

మరోవైపు, స్థానిక జీవజాతులను పాముల నుంచి రక్షించేందుకు న్యూజిలాండ్ కఠినమైన నియమనిబంధనలు రూపొందించింది. టూరిస్టులూ, లేదా న్యూజిలాండ్ పౌరులు స్వదేశానికి తిరిగొస్తున్నప్పుడు తమ వెంట బయటిదేశాల్లోని పాములు తీసుకురాకూడదనే నిబంధనల అమలు చేస్తోంది. అక్కడి జంతుప్రదర్శనశాలల్లో కూడా పాములు ఉండవు. అయితే, ఇతర సరీసృపాలు మాత్రం అక్కడ భారీ సంఖ్యలోనే ఉన్నాయి.

భౌగోళిక శాస్త్రం ప్రకారం సుమారు 8.5 కోట్ల సంవత్సరాల క్రితం గొండ్వానా అనే మహాఖండం నుంచి ఓ భాగం విడివడి న్యూజిలాండ్ ఏర్పడింది. చుట్టూరా పసిఫిక్ మహాసముద్రం ఉండటంతో న్యూజిలాండ్‌లోని వృక్ష, జంతుజాలాలు, ఇతర ప్రాంతాల ప్రభావం లేకుండా పరిణామం చెందాయి.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌ క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2024 | 07:06 PM

Advertising
Advertising