Nischa Shah: ఒక్క సంవత్సరానికే రూ.8 కోట్లు.. ఎలాగో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
ABN, Publish Date - Jul 13 , 2024 | 02:19 PM
ఒక సంవత్సరంలో రూ.8 కోట్లు సంపాదించడం అనేది అంత ఆషామాషీ విషయం కాదు. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్లకు అదే సులువే అవ్వొచ్చు కానీ.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, జీరో నుంచి ఆ స్థాయికి చేరుకోవడమంటే దాదాపు..
ఒక సంవత్సరంలో రూ.8 కోట్లు సంపాదించడం అనేది అంత ఆషామాషీ విషయం కాదు. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్లకు అదే సులువే అవ్వొచ్చు కానీ.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, జీరో నుంచి ఆ స్థాయికి చేరుకోవడమంటే దాదాపు అసాధ్యమేనని చెప్పుకోవాలి. కానీ.. ఓ యువతి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. కేవలం ఒక్క ఏడాదిలో అంత భారీ అమౌంట్ ఆర్జించి.. యువతకు ఆదర్శంగా నిలిచింది. అసలెలా సంపాదించిందనేగా మీ సందేహం.. ఈమధ్య ప్రతి నిరుద్యోగికి జీవనాధారంగా మారిన యూట్యూబ్ (Youtube) ద్వారా!
ఆ యువతి పేరు నిశ్చా షా. ఆమె లండన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పని చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఆ ఉద్యోగంలో కొనసాగింది. అయితే.. ఉద్యోగం తనకు సంతృప్తికరంగా అనిపించకపోవడం, చేసిన పనే పదే పదే చేసి విసుగెత్తిపోవడంతో.. దానికి స్వస్తి పలికింది. ఏదైనా కొత్తగా చేయాలన్న ఉద్దేశంతో.. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. చివరకు తాను తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని నిరూపించింది. ఈ యూట్యూబ్ ద్వారా ప్రస్తుతం ఆమె తన నెలవారీ జీతం కంటే నాలుగు రెట్లు ఎక్కువగా సంపాదిస్తోంది. గతేడాది మే నెల నుంచి 2024 మే మధ్య ఆమె ఏకంగా రూ.8 కోట్లు సంపాదించింది. ఈ విషయాన్ని స్వయంగా తానే ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది.
తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి ముందే నిశ్చా షా యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. మొదట్లో 1000 సబ్‌స్ర్కైబర్ల మార్క్‌ని అందుకోవడానికి ఆమెకు ఏకంగా 11 నెలల సమయం పట్టింది. ఎప్పుడైతే ఆమె 2022 సెప్టెంబర్‌లో తన జీవితంపై ఓ వీడియో అప్‌లోడ్ చేసిందో, అప్పటి నుంచి ఆమె అదృష్టం మారిపోయింది. ఆ వీడియో బాగా వైరల్ అవ్వడంతో.. 50 వేల మంది సబ్‌స్ర్కైబర్లు వచ్చేశారు. అంతేకాదు.. రూ.3 లక్షలు కూడా ఆమెకు వచ్చాయి. అప్పుడే తాను ఫుల్‌టైమ్ యూట్యూబర్‌గా మారాలని నిర్ణయించుకొని, తన ఉద్యోగానికి స్వస్తి పలికింది. కాగా.. నిశ్చా షా తనదైన శైలిలో ఎట్రాక్టివ్‌గా ఫైనాన్స్‌కు సంబంధించిన సలహాలు ఇస్తూ, వీడియోలు చేస్తోంది.
Read Latest Viral News and Telugu News
Updated Date - Jul 13 , 2024 | 05:09 PM