నూడుల్స్ కనిపిస్తే నో రూల్స్!
ABN, Publish Date - Nov 10 , 2024 | 09:56 AM
మనముందు పంచభక్ష్యపరమాన్నాలున్నా సరే.. నూడుల్స్ కనిపించగానే నోరూరుతుంది. ఉప్పు, కారం, మసాలా, సాస్ దట్టించిన నూడుల్స్ అంటే పిల్లలు ఎగిరిగంతేస్తారు. అందులోనూ అప్పటికప్పుడు క్షణాల్లో తయారయ్యే తిండి ఏదన్నా ఉందా అంటే అది నూడుల్సే!. ముఖ్యంగా బడి పిల్లలకు ఇదే ప్రధాన ఆహారం అయ్యిందిప్పుడు.
మనముందు పంచభక్ష్యపరమాన్నాలున్నా సరే.. నూడుల్స్ కనిపించగానే నోరూరుతుంది. ఉప్పు, కారం, మసాలా, సాస్ దట్టించిన నూడుల్స్ అంటే పిల్లలు ఎగిరిగంతేస్తారు. అందులోనూ అప్పటికప్పుడు క్షణాల్లో తయారయ్యే తిండి ఏదన్నా ఉందా అంటే అది నూడుల్సే!. ముఖ్యంగా బడి పిల్లలకు ఇదే ప్రధాన ఆహారం అయ్యిందిప్పుడు. వేల ఏళ్ల కిందట చైనాలో మొదలైన నూడుల్స్‌ను ప్రపంచమంతా అలవాటు చేసుకుంది. నూడుల్స్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇవి..
వేల ఏళ్ల నుంచి చైనాలో నూడుల్స్ ఉన్నాయని తేల్చింది పురావస్తు శాఖ. ‘లాజిల్స్’ అనే ప్రాంతంలో 4 వేల ఏళ్ల నాటి నూడుల్స్ మట్టిపాత్ర
శిలాజం బయల్పడింది. అప్పట్లో తృణధాన్యాలతో వీటిని తయారుచేసేవారు.
పస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముప్పయి రకాల నూడుల్స్ ఉన్నాయి. ఆసియా ఖండంలో 15 రకాలను మాత్రమే జనం ఇష్టపడి తింటున్నారు. బియ్యం, గోధుమ, మైదా, సెమోలినా వంటి పదార్థాలతో తయారవుతున్నాయివి.
ఏడాదికి భారత్‌లో అమ్ముడయ్యే మ్యాగీనూడుల్స్.. 6,000,000,000. పదిహేను నెలల్లో జరిగిన అమ్మకాల విలువ రూ.24,275 కోట్లు.
ఒకప్పుడు నూడుల్స్ ఖరీదైన, విలాస వంతమైన ఆహారం. ధనికులు మాత్రమే తినేవారు. రానురాను
సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి.
ఇన్‌స్టంట్ రామెన్ నూడుల్స్‌ను తొలిసారి జపాన్‌వాసులు తయారుచేశారు. ఇప్పుడివి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.
ఎక్కడా లేనివిధంగా జపాన్‌లోని ఒకహామాలో ‘కప్ నూడుల్స్ మ్యూజియం’ వెలసింది. ఆహార ఉద్యమంలో నూడుల్స్ పాత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తుందీ ప్రదర్శనశాల. ఇక్కడ 4,560 రకాల నూడుల్స్ తయారీ ప్రక్రియలను చూడొచ్చు.
‘ద వరల్డ్ ఇన్‌స్టంట్ నూడుల్స్ అసోసియేషన్’ సమాచారం ప్రకారం ఏటా అమ్ముడవుతున్న ఇన్‌స్టంట్ నూడుల్స్ కప్‌లు లేదా ప్యాకెట్లు 10,000 కోట్లు.
‘నూడెల్’ అనే జర్మన్ పదం నుంచి వచ్చింది నూడుల్. కుడుముల వంటి పదార్థమని అర్థం.
చైనాకు చెందిన జియాంగ్జియన్ అనే సంస్థ అతి పొడవైన నూడుల్స్‌ను తయారుచేసి గిన్నిస్‌లోకి ఎక్కింది. ఉద్యోగులు 17 గంటలు కష్టపడి
3 కిలోమీటర్ల పొడవైన నూడుల్స్‌ను వండారు.
జపాన్ వ్యొమగామి సొయిచి నొగుచి 2005లో అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు నూడుల్స్ తీసుకెళ్లాడు.
వీటిని జీరోగ్రావిటీని దృష్టిలో పెట్టుకుని నిస్సిన్‌ఫుడ్స్ తయారుచేసింది.
ఫెడరల్ లా ప్రకారం 5.5 శాతం ఘనపదార్థం రూపంలో గుడ్డు పోషకాలు ఉంటేనే నూడుల్స్ అని పిలుస్తారు.
నూడుల్స్ వినియోగంలో చైనా, ఇండోనేషియా, ఇండియా, వియత్నాం, జపాన్, అమెరికా, ఫిలిప్పీన్స్.. ముందువరుసలో ఉన్నాయి.
న్యూయార్క్‌లోని రైకర్స్ జైలులోని ఖైదీలు ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను ఎక్కువగా కొంటారు.
నూడుల్స్‌పై ఒక చక్కటి చిత్రం వచ్చింది. అదే ‘ద రామెన్ గర్ల్’. ఈ సినిమా వచ్చాక చాలామంది సెలబ్రిటీలు తమకు ఇష్టమైన ఆహారం నూడుల్స్ అని చెప్పేవారు.
స్విట్జర్లాండ్ వాసి ‘జూలియస్ మైఖేల్ జొహనస్ మ్యాగీ’ (1846-1912).. రెడీమేడ్ సూప్‌లు, మ్యాగీ సాస్‌ల తయారీలో దిట్ట. ఆయన పేరుతోనే ‘మ్యాగీ’ ప్రసిద్ధి చెందింది. ఆ కంపెనీని నెస్లే విలీనం చేసుకుంది.
Updated Date - Nov 10 , 2024 | 09:56 AM