ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పిచ్చి పీక్స్‌కు చేరింది భయ్యా.. పొలం పని చేసే పారతో కటింగ్.. నెటిజన్ల కామెంట్లు చదివితే..

ABN, Publish Date - Jul 15 , 2024 | 02:12 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం ప్రజలు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. విచిత్రమైన ఆలోచనలతో వీడియోలు చేసి వైరల్‌ అయిపోవడానికి తహతహలాడుతున్నారు. ఎవరికి వారు తమ క్రియేటివిటికీ పదును పెట్టి విచిత్రమైన వీడియోలు చేసి సోషల్ మీడియాలోకి వదులుతున్నారు.

hair style

ప్రస్తుతం సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం ప్రజలు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. విచిత్రమైన ఆలోచనలతో వీడియోలు చేసి వైరల్‌ (Viral) అయిపోవడానికి తహతహలాడుతున్నారు. ఎవరికి వారు తమ క్రియేటివిటికీ (Creativity) పదును పెట్టి విచిత్రమైన వీడియోలు చేసి సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. తాజాగా ఓ బార్బర్ (Barber) తన సృజనాత్మకతకు పదును పెట్టి వెరైటీ కటింగ్ చేశాడు. రేజర్, కత్తెరను కాకుండా ఏకంగా పొలం పనిలో ఉపయోగించే పారతో (shovel) కటింగ్ చేశాడు (Viral Video).


sen_hair_salon అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను ఓ సెలూన్‌లో చిత్రీకరించారు. హెయిర్‌కట్ కోసం ఓ వ్యక్తి సెలూన్‌లో కూర్చున్నాడు. కుర్చీ వెనుక నిలబడి ఉన్న బార్బర్ అతడి జుట్టును వింతగా తొలగిస్తున్నాడు. ఆ వ్యక్తి చేతిలో పొలం పనిచేసే పార ఉంది. దానిని పట్టుకుని కస్టమర్ తలపై జుట్టును తొలగించాడు. గొర్రె జుట్టును తొలగిస్తున్నట్టు కటింగ్ చేశాడు. చాలా వింత డిజైన్‌తో ఆ కటింగ్ ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకూ 1.4 కోట్ల మందికి పైగా వీక్షించారు. 1.5 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``తర్వాతి సారి జేసీబీతో కటింగ్ చేయండి``, ``చూడడానికి ఇదొక్కటే మిగిలింది``, ``ప్రమాదకరమైన బార్బర్``, ``జీవితం మీద ఎలాంటి ఆశలూ లేనపుడు ఆ సెలూన్‌కు వెళతా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కళ్ల ముందే నదిలో ఎలా కొట్టుకుపోయాడో చూడండి..!


Viral Video: వరదొచ్చినా విందు ఆరగించాల్సిందే.. భార్యలను ఎత్తుకొని మరీ ఎలా వెళ్తున్నారో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 15 , 2024 | 02:51 PM

Advertising
Advertising
<