ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఆ స్కూల్‌లో పేరెంట్స్‌‌కి కూడా ఫీజు కట్టాల్సిందే.. నర్సరీకి ఎంత ఫీజు కట్టాలో తెలిస్తే.. పోస్ట్ వైరల్..

ABN, Publish Date - Oct 25 , 2024 | 08:53 AM

చదువు చెప్పే గురువులను, వైద్యం చేసే డాక్టర్లను దేవుళ్లతో సమానంగా భావించాలి. అయితే దురదృష్టవశాత్తూ మనదేశంలో ఆ వృత్తులే అత్యధిక సంపాదనా మార్గాలుగా నిలుస్తున్నాయి. పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకుని లక్షల్లో ఫీజులు కడుతున్న వారు ఎందరో ఉన్నారు.

Nursery fee receipt

ఏ దేశంలో అయినా పౌరులకు అత్యంత అవసరమైనవి విద్య, వైద్యం. చదువు చెప్పే గురువులను, వైద్యం చేసే డాక్టర్లను దేవుళ్లతో సమానంగా భావించాలి. అయితే దురదృష్టవశాత్తూ మనదేశంలో ఆ వృత్తులే అత్యధిక సంపాదనా మార్గాలుగా నిలుస్తున్నాయి. పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకుని లక్షల్లో ఫీజులు (School fee) కడుతున్న వారు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ స్కూల్ ఫీజు రిసీప్ట్ చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే. కేవలం నర్సరీ కోసం ఆ స్కూల్ వసూలు చేస్తున్న ఫీజు (Nursery fee) చాలా మందికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral News).


@DrJagdishChatur అనే ట్విటర్ యూజర్ ఈ పోస్ట్ చేశారు. ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌కు సంబంధించిన ఫీజు రిసీప్ట్‌ను ఆ డాక్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ పోస్ట్ ప్రకారం.. ఆ స్కూల్ నర్సరీ క్లాస్ కోసం ఏకంగా రూ.1.51 లక్షల ఫీజును వసూలు చేస్తోంది. దానికి అదనంగా రూ. 8,400ను పేరెంట్ ఓరియేంటేషన్ ఫీజుగా వసూలు చేస్తోంది. అంటే స్కూలు గురించి, పిల్లల చదువు గురించి పేరెంట్స్‌తో టీచర్లు నిర్వహించే మీటింగ్ కోసం ఏడాదికి ఏకంగా రూ.8,400 కట్టాలన్నమాట. డాక్టర్ అయిన జగదీష్ చతుర్ ఈ ట్వీట్ చేసి.. తాను కూడా ఓ స్కూల్ పెట్టాలనుకుంటున్నట్టు కామెంట్ చేశారు. ఆ స్కూల్ ఫీజులో 20 శాతం కూడా డాక్టర్ కన్సల్టేషన్ కోసం చెల్లించడానికి ఎవరూ ఇష్టపడరని కామెంట్ చేశారు.


ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ పోస్ట్‌ను 98 వేల మందికి పైగా వీక్షించారు. రెండు వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``తమ కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టుకోని వారు తమ పిల్లల కోసం ఇలా లక్షలు ఖర్చుపెడతారు``, ``నేను ఇంతకంటే చాలా తక్కువకే ఇంజినీరింగ్ పూర్తి చేశాను``, ``పేరెంట్స్ బలహీనతే ఇలాంటి స్కూళ్లకు ప్రాణం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: బెడ్రూమ్‌లో విషపూరిత సర్పాల రొమాన్స్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..

Tibet: మన కళ్ల ముందే పరిణామ క్రమం.. టిబెట్ మహిళల శరీరతత్వంపై వెలువడిన ఆసక్తికర పరిశోధన..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 25 , 2024 | 08:53 AM