ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: ఇంత క్రియేటివిటీ ఎలా సార్.. పోలీసుల ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా

ABN, Publish Date - Nov 09 , 2024 | 06:25 PM

పోలీసులు క్రియేటివిటీకి నెటిజన్ల పొట్ట చెక్కలవుతోంది. వీరు పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇంటర్నెట్ మొత్తాన్ని షేక్ చేస్తోంది. ఇంతకీ అందులో ఏముందంటే..

Odisha PS

భువనేశ్వర్: ఎప్పుడూ నేరస్థులు, కేసులతో బిజీగా ఉండే పోలీసులు తమ క్రియేటివీటి పదును పెట్టారు. వారు హ్యాండిల్ చేస్తున్న సోషల్ మీడియా ఖాతాను రొటీన్ కు భిన్నంగా ప్రెజెంట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఇంతకీ పోలీసులు చేసిన పనేంటి అంటే.. ఒడిశాలోని బెర్హంపూర్ పోలీసులు తండ్రీ కొడుకులపై దాడి చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. సహజంగా నిందితుల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేప్పుడు ముఖాన్ని బ్లర్ చేస్తుంటారు. ఈ పోలీసులు మాత్రం కాస్త భిన్నంగా.. బ్లర్ చేసేందుకు బదులు ఫన్నీ ఎమోజీలను ఉంచారు. ఇది చూసిన వారు పగలబడి నవ్వుకుంటున్నారు.


ఫొటోలో కొన్ని సాడ్ ఎమోజీలు, కళ్లు తేలేసినవి, పశ్చాత్తాపంతో ఉన్నవి ఉన్నాయి. ఇది చూసిన నెటిజన్లకు నోట మాట రాకుండా పోయింది. వాళ్లు చేసిన నేరానికి బాధ పడాలో మీ క్రియేటివిటీ చూసి నవ్వుకోవాలో తెలియడం లేదు సార్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొన్ని గంటల్లోనే ఈ వార్త నెట్టింట సెన్సేషన్ గా మారింది. ఈ ఫొటోకు.. ఈ నలుగురూ తండ్రీ కొడుకులపై దాడి చేసిన కేసులో అరెస్టయ్యారు అని ఉంది. కానీ, క్యాప్షన్ చూసి ఫొటో వైపు చూసేందుకు వచ్చే యూజర్ కు పొట్టచెక్కలవ్వడం ఖాయం. పోలీసుల హాస్య చతురత నెటిజన్లను తెగ ఇంప్రెస్ చేసేసింది. కొందరు వారిని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఇదొక్కటే కాదు బెర్హంపూర్ సోషల్ మీడియా పేజీలో ఇలాంటి ఎమోజీలున్న ఫొటోలు చాలానే ఉన్నాయి.

4B Movement: అమెరికాలో మరో ఉద్యమం! పురుషులతో శృంగారానికి నో అంటున్న మహిళలు


Updated Date - Nov 09 , 2024 | 06:25 PM