Viral Video: ఈ బామ్మ తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. చేతులతో అల్లిన స్వెట్టర్‌ను చిన్న ట్రిక్‌తో ఎలా మార్చిందంటే..
ABN, Publish Date - Jan 11 , 2024 | 04:55 PM
‘‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్’’.. అని మిర్చి సినిమాలో ప్రభాస్ అన్నట్లుగా.. నిజ జీవితంలోనూ కొన్ని కొన్ని బ్రాండ్ల పేరుకు అంత డిమాండ్ ఉంటుంది. బ్రాండ్ పేరు చూడగానే
‘‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్’’.. అని మిర్చి సినిమాలో ప్రభాస్ అన్నట్లుగా.. నిజ జీవితంలోనూ కొన్ని కొన్ని బ్రాండ్ల పేరుకు అంత డిమాండ్ ఉంటుంది. బ్రాండ్ పేరు చూడగానే కొందరు ఖర్చుకు వెనకాడకుండా సదరు వస్తువులను కొనేస్తుంటారు. కొన్నిసార్లు వస్తువు ఎంత నాణ్యమైనది అయినా సరైన బ్రాండ్ పేరు లేకపోతే దానికి విలువ ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ బామ్మ తయారు చేసిన స్వెట్టర్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఈ బామ్మ తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చలికాలం కావడంతో ఓ బామ్మ తన మనువడి కోసం అందమైన స్వెట్టర్‌ను (Beautiful sweater) తన స్వహస్తాలతో తయారు చేయాలని అనుకుంది. అందుకు తగ్గట్టుగానే తన చేతులతో అందమైన తెల్లటి స్వెట్టర్‌ని తయారు చేసింది. అయితే చివరగా దానికి ఏదైనా మెరుగులు దిద్దాలని అనుకుంది. తన మనువడు రిచ్‌గా కనిపించాలనే ఉద్దేశంతో.. తాను తయారు చేసిన స్వెట్టర్‍ను కూడా బ్రాండెడ్‌గా డ్రెస్‌గా మార్చింది.
Viral Video: వామ్మో! ఇంతకీ ఇతను మనిషేనా.. దుప్పటి పైకి తీయగా.. లోపలి నుంచి ఏమొచ్చాయో చూడండి..
బ్రాండెడ్‌గా డ్రెస్‌గా కనిపించేందుకు.. ఆమె స్వెట్టర్‌పై adidas అనే అక్షరాలతో పాటూ లోగోను నల్లటి దారంతో కుట్టేసింది. ఫైనల్‌గా adidas కంపెనీకి చెందిన అందమైన స్వెట్టర్‌లా మారిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఈ బామ్మ తెలివికి హ్యాట్సాప్’’.. అంటూ కొందరు, ‘‘బ్రాండెడ్ వస్తువులకు తగ్గేదే..లే.. అన్నట్లుగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Updated Date - Jan 11 , 2024 | 05:44 PM