Onion Juice: ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు ఇలా అప్లై చేస్తే.. షాకింగ్ ఫలితాలు పక్కా..!
ABN, Publish Date - Jun 22 , 2024 | 08:51 PM
ఉల్లిపాయ.. ఈ మధ్యకాలంలో జుట్టు సంరక్షణలో చాలా పాపులర్ అయ్యింది. ఉల్లిపాయ జుట్టు రాలడాన్ని ఆపుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడంలోనూ, నల్లగా మారడంలోనూ, జుట్టు మందంగా మారడంలోనూ సహాయపడుతుంది. ఉల్లిపాయ సారంతో తయారుచేసిన షాంపూలు, హెయిర్ ఆయిల్స్, సీరమ్ వంటివి మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముడుపోతున్నాయంటే ఉల్లిపాయకున్న క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది.
ఉల్లిపాయ.. ఈ మధ్యకాలంలో జుట్టు సంరక్షణలో చాలా పాపులర్ అయ్యింది. ఉల్లిపాయ జుట్టు రాలడాన్ని ఆపుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడంలోనూ, నల్లగా మారడంలోనూ, జుట్టు మందంగా మారడంలోనూ సహాయపడుతుంది. ఉల్లిపాయ సారంతో తయారుచేసిన షాంపూలు, హెయిర్ ఆయిల్స్, సీరమ్ వంటివి మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముడుపోతున్నాయంటే ఉల్లిపాయకున్న క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది. కానీ కొందరు ఉల్లిపాయ వాడినా జుట్టు పెరుగుదలలో అంత ప్రయోజనకర ఫలితాలు లేవని అంటూ ఉంటారు. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ఉల్లిపాయను ఎలా వాడాలంటే..
వీర్యకణాల సంఖ్యను పెంచే శక్తివంతమైన ఆహారాలు ఇవి..!
ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలకు సహాయపడినా చాలామంది దీన్ని ఉపయోగించడం పట్ల విముఖత వ్యక్తం చేస్తారు. దీనికి కారణం ఉల్లిపాయ రసం ఘాటైన వాసన. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేస్తే చాలా రోజుల వరకు దీని వాసన జుట్టును అంటిపెట్టుకుని ఉంటుంది. ఈ కారణంగా చాలామంది దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయని తెలిసినా దీనికి దూరంగా ఉంటారు. అయితే అలాంటి వారు ఉల్లిపాయ రసాన్ని ఈ కింది విధంగా వాడితే వాసన చాలా వరకు తగ్గుతుంది.
3 టీస్పూన్ల ఉల్లిపాయ రసంతో 2 టీస్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు, స్కాల్ప్ మీద సమానంగా అప్లై చేయాలి. దీన్ని 30 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత గాఢత లేని షాంపూతో తల స్నానం చెయ్యాలి.
ఎముకలు ఉక్కులా దృఢంగా మారాలంటే ఇవి అలవాటు చేసుకోండి..!
ఉల్లిపాయలలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు జుట్టు పెరగడానికి లేదా ఆరోగ్యకరంగా మెయింటైన్ చేయడానికి సహాయపడుతాయి. కనీసం వారానికి ఒకసారి లేదా రెండుసార్లు ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేస్తుంటే కేవలం ఒక్క నెలలోనే షాకింగ్ ఫలితాలు ఉంటాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jun 22 , 2024 | 08:51 PM