ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Onion Vs Garlic: జుట్టు ఒత్తుగా పెరగడానికి ఏది ఎక్కువ హెల్ప్ చేస్తుంది? ఉల్లిపాయనా లేదా వెల్లుల్లినా?

ABN, Publish Date - Apr 17 , 2024 | 05:17 PM

సోషల్ మీడియాలో జుట్టు పెరుగుదలకు సంబంధించి బోలెడు చిట్కాలు వైరల్ అవుతుంటాయి. వాటిలో రైస్ వాటర్ నుండి కరివేపాకు, ఉల్లిపాయ, వెల్లుల్లితో పాటు చాలా ఉన్నాయి. కానీ ఉల్లిపాయ, వెల్లుల్లి.. రెండింటిలో ఏది బెస్టంటే..

సోషల్ మీడియాలో జుట్టు పెరుగుదలకు సంబంధించి బోలెడు చిట్కాలు వైరల్ అవుతుంటాయి. వాటిలో రైస్ వాటర్ నుండి కరివేపాకు, ఉల్లిపాయ, వెల్లుల్లితో పాటు చాలా ఉన్నాయి. అయితే జుట్టు పెరుగుదల కోసం చాలా ఫాలో అయ్యేవి ఉల్లిపాయ, వెల్లుల్లి. ఈ రెండింటిలో జుట్టు ఒత్తుగా పెరగడానికి ఏది బాగా సహాయపడుతుందో తెలుసుకుంటే..

ఉల్లిపాయ..

ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్ కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టు కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది

ఆడవాళ్లు పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!


ఉల్లిపాయలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. కొంతమందిలో జుట్టు రాలడానికి కూడా కారణమవుతాయి.

ఉల్లిపాయ రసం సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఇది జుట్టు చిక్కులు లేకుండా చేయడంలోనూ, జుట్టు విరిగిపోవడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఉల్లిపాయ రసం యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది. చుండ్రుకు సహజంగా చికిత్స చేస్తుంది. ఇది తలలో చుండ్రును కలిగించే శిలీంధ్రాలను వదిలించడంలో సహాయపడుతుంది.

బీపీ పెషెంట్లు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే.. సేఫ్ గా ఉండొచ్చట!


వెల్లుల్లి..

వెల్లుల్లిలో కూడా సల్ఫర్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి మెరుగ్గా ఉంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది.

వెల్లుల్లిలో జింక్, సెలీనియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇవి బలమైన, ఆరోగ్యకరమైన జుట్టుకు సహాయపడతాయి. ఇవి జుట్టు విరిగిపోకుండా నిరోధించడానికి, కుదుళ్ల నుండి జుట్టు తంతువులను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. స్కాల్ప్‌కి మెరుగైన రక్త ప్రసరణ ఉంటే హెయిర్ ఫోలికల్స్ కి పోషకాలు, ఆక్సిజన్‌ సమృద్దిగా అందుతాయి.

వెల్లుల్లిలో సహజ యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రు, దురద వంటి స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఆరోగ్యకరమైన తల చర్మం చాలా ముఖ్యం.

అధిక రక్తపోటు తొందరగా తగ్గడానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివీ..!


రెండింటిలో ఏది బెస్ట్..

ఉల్లిపాయ, వెల్లుల్లి రెండూ వాటి అధిక సల్ఫర్ కంటెంట్, ఇతర పోషక లక్షణాల కారణంగా జుట్టు పెరుగుదలకు మంచి ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, రెండింటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.

వెల్లుల్లిలో జింక్, సెలీనియం ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టుకు దోహదం చేస్తాయి. ఉల్లితో పోలిస్తే వెల్లులిలో జుట్టు పెరుగుదలకు సహాయపడే పోషకాలెక్కువ.

ఉల్లిపాయలతో పోలిస్తే వెల్లుల్లి బలమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది చుండ్రు వంటి స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌లను సులువుగా తగ్గిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

అధిక రక్తపోటు తొందరగా తగ్గడానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివీ..!

ఆడవాళ్లు పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!

మరిిన్ని ప్రత్యేక వార్తల కోసం... ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 17 , 2024 | 06:04 PM

Advertising
Advertising