ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Open Pores: ఓపెన్ పోర్స్ కు సూపర్ ట్రీట్మెంట్.. ఈ టిప్స్ ట్రై చేయండి..!

ABN, Publish Date - Jun 30 , 2024 | 04:45 PM

ఓపెన్ పోర్స్ అమ్మాయిలను చాలా ఇబ్బంది పెట్టే సమస్య. వీటినే డింపుల్ అని కూడా అంటారు. ముఖ చర్మం మీద రంధ్రాలు పెద్దగా తెరచుకుని ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడం కోసం అమ్మాయిలు చాలా రకాల చిట్కాలు ఫాలో అవుతుంటారు. అయితే ఆశించిన ఫలితాలు మాత్రం ఉండవు. అలాంటి వారికోసం సూపర్ టిప్స్ ఉన్నాయి.

ఓపెన్ పోర్స్ అమ్మాయిలను చాలా ఇబ్బంది పెట్టే సమస్య. వీటినే డింపుల్ అని కూడా అంటారు. ముఖ చర్మం మీద రంధ్రాలు పెద్దగా తెరచుకుని ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడం కోసం అమ్మాయిలు చాలా రకాల చిట్కాలు ఫాలో అవుతుంటారు. అయితే ఆశించిన ఫలితాలు మాత్రం ఉండవు. అలాంటి వారికోసం సూపర్ టిప్స్ ఉన్నాయి. ఈ టివ్స్ ఫాలో అయితే ఓపెన్ పోర్స్ తగ్గిపోయి చర్మం సాధారణంగా మారిపోతుంది.

అరటితొక్క..

అరటి తొక్కలు ఓపెన్ పోర్స్ ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. తొక్క లోపలి భాగాన్ని తడి ముఖం మీద 10 నుండి 15 నిమిషాల పాటూ రుద్దాలి. ఆ తరువాత 10 నిమిషాలు అలాగే ఉంచి తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే ముఖం మీద తెరచుకున్న రంధ్రాలు తగ్గిపోయి సాధారణం అవుతుంది.

Curry Leaves: రోజూ ఉదయాన్నే ఒక రెమ్మ పచ్చి కరివేపాకులు నమిలి తింటే జరిగేది ఇదే..!



దోసకాయ..

దోసకాయ రసం కూడా ముఖం మీద తెరచుకున్న రంధ్రాలను తగ్గిస్తుంది. 2 చెంచాల దోసకాయ రసంలో ఒక చెంచా నిమ్మరసం కలిపి కాటన్ బాల్ తో ముఖానికి పట్టించాలి. ఆరిన తరువాత కడిగేసుకోవాలి. దీన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే ఓపెన్ పోర్స్ తగ్గిపోతాయి.

పసుపు...

ఒక చెంచా పసుపును నీళ్లలో కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఓపెన్ పోర్స్ మీద అప్లై చేయాలి. దాదాపు 10 నిమిషాల పాటూ అలాగే ఉంచి ఆ తరువాత కడిగేయాలి. ఇది కూడా ఓపెన్ పోర్స్ ను తగ్గిస్తుంది.

Life Lesson: మీ జీతం ఎంత అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? రిటైర్డ్ ఐఏఎస్ ఇచ్చిన సలహా ఇది..!



ఓట్స్..

ఒక చెంచా పాలలో 2 చెంచాల గ్రౌండ్ ఓట్స్ వేయాలి. దీన్ని ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి కాసేపు ఆగిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది వారానికి ఒకసారి చేస్తుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

ఐస్ థెరపీ..

ఐస్ థెరపీ కూడా ఓపెన్ పోర్స్ ను ట్రీట్ చేస్తుంది. ముఖం మీద గుంటలు కూడా తగ్గుతాయి. ఐస్ క్యూబ్స్ తీసుకుని ఓపెన్ పోర్స్ రంధ్రాల పై రుద్దాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఓపెన్ పోర్స్ తగ్గడంలో సహాయపడుతుంది.

Health Tips: ఈ 3 తినండి చాలు.. 60 ఏళ్లు వచ్చినా యవ్వనంగా ఉంటారు..!


మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 30 , 2024 | 04:45 PM

Advertising
Advertising