Optical Illusion: మీ కళ్లకు అసలైన పరీక్ష.. 5సెకెన్లలో అవకాడోలలో హృదయం ఆకారాన్ని కనిపెట్టండి చూద్దాం..!
ABN, Publish Date - Jul 10 , 2024 | 07:01 AM
పజిల్స్ పరిష్కరించడం, ఆప్టికల్స్ ఇల్యూషన్, ఫొటోలలో ఉన్న తేడాలు కనుక్కోవడం మొదలైనవి ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్నాయి. ఇవి మెదడుకు, కంటి చూపుకు పదును పెడతాయి. ప్రస్తుతం అలాంటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం 5 సెకెన్లలో..
పజిల్స్ పరిష్కరించడం, ఆప్టికల్స్ ఇల్యూషన్, ఫొటోలలో ఉన్న తేడాలు కనుక్కోవడం మొదలైనవి ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్నాయి. ఇవి మెదడుకు, కంటి చూపుకు పదును పెడతాయి. ప్రస్తుతం అలాంటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం 5 సెకెన్ల వ్యవధిలో ఫొటోలో ఉన్న అవకాడోలో హృదయం ఆకారాన్ని కనిపెట్టాలి. చాలామందికి ఇది మంచి బ్రెయిన్ ఎక్సర్సైజ్ గా పనిచేస్తోంది. ఈ ఫొటో గురించి తెలుసుకుంటే..
ఫొటోలో సగానికి కట్ చేసి ఉన్న అవకాడో ఆకారాలు ఉన్నాయి. ఈ ఆకారాలలో గుండ్రని విత్తనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఒక్క అవకాడో విత్తనం మాత్రం గుండ్రని ఆకారంలో కాకుండా హృదయం ఆకారంలో ఉంది. దాన్ని కేవలం 5 సెకెన్లలో కనుక్కోవాలి. కేవలం గ్రద్ద లాంటి దృష్టి ఉన్నవాళ్లు మాత్రమే దీన్ని కనుక్కోగలరని చెబుతున్నారు. 5 సెకెన్లలో హృదయం ఆకారంలో ఉన్న అవకాడోను కనుక్కుంటే వారి ఐక్యూ(IQ) స్థాయి బాగుందని అర్థం.
5ఏళ్ల లోపు పిల్లలకు ఈ 5 విషయాలు తప్పక నేర్పించాలి..!
ఫొటోలోని అవకాడోలో కింద నుండి మూడవ వరుస మొదట్లోనే హృదయం ఆకారం ఉన్న అవకాడో విత్తనాన్ని చూడవచ్చు. చాలామంది ఈ పజిల్ ను పరిష్కరించగా మరికొందరు మాత్రం చేతులెత్తేస్తున్నారు.
ఖాళీ కడుపుతో గుమ్మడి గింజలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!
ఈ శాకాహార ఆహారాలు తింటే చాలు.. ఆయుష్షు ఫుల్..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jul 10 , 2024 | 07:01 AM