Optical Illusion: మీ కంటిచూపుకు ఛాలెంజ్.. 8 సెకెన్లలోపు ఫొటోలో కుక్క ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం..
ABN, Publish Date - Oct 31 , 2024 | 02:37 PM
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు చాలా సరదాగా అనిపిస్తాయి కానీ ఇవి మెదడుకు, కంటికి పెట్టే పని అంతా ఇంతా కాదు..
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఇప్పట్లో మెదడుకు పదును పెట్టడంలో ముందు ఉంటున్నాయి. వీటిని పరిష్కరించడం చాలా సరదాగా అనిపించినప్పటికి ఇవి మెదడుకు చాలా మంచి వ్యాయామం అందిస్తాయి. బొమ్మల మధ్య తేడాలు కనిపెట్టడం, గీతల మధ్య దారి కనుక్కోవడం, పదాలు పూరించడం, సుడోకు.. మొదలైన వాటికి ధీటుగా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నిలుస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ కు సంబంధించి ఒక ఫొటో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో కుక్క ఎక్కుడుందో 8 సెకన్లలోపు కనిపెట్టాలట. ఇలా కంటి చూపు శక్తివంతంగా ఉన్నవారు మాత్రమే 8 సెకెన్లలోపు దీన్ని కనుక్కోగలరని అంటున్నారు. దీని వైపు ఓ లుక్కేస్తే..
దీపావళి లక్ష్మీ పూజను ఈ సింపుల్ టిప్స్ తో జరుపుకోండి..
ఇవ్వబడిన ఆప్టికల్ ఫొటోలో చెట్ల మధ్య కూర్చుని ఒక వేటగాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతని దగ్గర తుపాకీ, తలకు పెట్టుకునే టోపి వంటివన్నీ ఉన్నాయి. అతనికి దగ్గర్లోనే కుక్క కూడా ఉందట. కానీ అది చూడగానే కంటికి కనిపించడం లేదు.. 8 సెకెన్లలోపు కుక్క ఎక్కడుందో వెతకాలి. చాలామంది కుక్క కనిపెట్టలేక చేతులెత్తుస్తున్నారు.
కుక్క ఎక్కడుందో కనిపెట్టలేని వారు వేటగాడి దగ్గరలో ఉన్న చెట్లను జాగ్రత్తగా పరిశీలించాలి. వేటగాడికి దగ్గరగా ఉన్న మొదటి చెట్టు దగ్గర తెల్లని రంగులో ఉన్న కుక్క చెట్టు పైకి చూస్తూ అక్కడ కూర్చుని ఉండటం కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్న తెలుపు రంగులో కుక్క రంగు కూడా కలిసిపోయి ఉండటం వల్ల కుక్కను కనిపెట్టడంలో చాలా మంది విఫలమవుతున్నారు. 8 సెకెన్లలోపు కుక్క ఎక్కడుందో కనుక్కున్నవారికి కంటిచూపు చాలా పదును ఉన్నట్టని అంటున్నారు. అంతేకాదు వీరి మెదడు పనితీరు, ఆలోచనాతీరు కూడా చాలా చురుగ్గా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ ఆహారాలు తినండి చాలు.. ముఖం మీద ముడతలు మాయం..
జీలకర్రను ఇలా వాడితే శరీరంలో కొవ్వు కరిగిపోద్ది..
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 31 , 2024 | 02:39 PM