Anant-Radhika Wedding: అనంత్ అంబానీ-రాధిక వివాహం.. పోలీసులు చేసిన పనికి ముంబై వాసులు గుస్సా
ABN, Publish Date - Jul 06 , 2024 | 09:26 PM
అనంత్ అంబానీ వివాహ వేడుక నేపథ్యంలో ముంబైలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంపై నగర వాసులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఇదేమైనా ప్రజా కార్యక్రమమా అని ప్రశ్నిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మరికొద్ది రోజుల్లో ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం జరగనుంది. ప్రీ వెడ్డింగ్ పార్టీనే అట్టహాసంగా జరుపుకున్న అంబానీ కుటుంబం ఇక పెళ్లి విషయంలో న భూతో న భవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ వివాహ వేడుకకు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులందరూ తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలకు సిద్ధమవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి (Viral).
Viral: పురుషుడి చెప్పులు గది బయట ఉంటే భద్రత! హోటల్స్‌లో ఒంటరి మహిళలకు సూచన
జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వివాహం జరగనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లే దారుల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలకు సిద్ధమయ్యారు. జులై 12 నుంచి జులై 15 వరకూ జరగనున్న ఈ వేడుకలకు సంబంధించి రోజూ మధ్యాహ్ననం 1 నుంచి అర్ధరాత్రి వరకూ ఆంక్షలు విధించారు. దీంతో ముంబై వాసులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ‘‘అది ఓ వ్యక్తిగత వేడుక.. ప్రజాకార్యక్రమం కాదు. మరి ఇంతలా ట్రాఫిక్ ఆంక్షలు ఎందుకూ అంటూ జనాలు ఫైరైపోతున్నారు (Outrage over Mumbai traffic curbs for Anant Ambani-Radhika Merchant wedding).
ఇప్పటికే ఈ వేడుకకు సంబంధఇంచి అంబానీ కుటుంబం సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి కూడా పోలీసులు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ఇక ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్‌ను వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే.
Updated Date - Jul 06 , 2024 | 09:30 PM