Viral Video: పాకిస్తాన్ బోర్డర్‌లో అరుదైన దృశ్యం.. సరిహద్దు అవతలి నుంచి ఎలా మాట్లాడుకున్నారో చూడండి..
ABN, Publish Date - Aug 23 , 2024 | 08:32 AM
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల గురించి వార్తలు వచ్చినప్పుడల్లా గొడవలు, కొట్లాటలు, ఉద్రిక్తతలు చోటుచేసున్నాయనే సమాచారం మాత్రమే ఉంటుంది. ఇరు దేశాల సైనికుల మధ్య ఎక్కువ సార్లు అలాంటి వాతావరణమే ఉంటుంది.
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల (India-Pakistan Border) గురించి వార్తలు వచ్చినప్పుడల్లా గొడవలు, కొట్లాటలు, ఉద్రిక్తతలు చోటుచేసున్నాయనే సమాచారం మాత్రమే ఉంటుంది. ఇరు దేశాల సైనికుల మధ్య ఎక్కువ సార్లు అలాంటి వాతావరణమే ఉంటుంది. అయితే ఇరు దేశాలకు చెందిన సామాన్య ప్రజల మధ్య మాత్రం అంతటి విద్వేషాలు ఉండవు. రెండు దేశాలకు చెందిన సామాన్య ప్రజలు ఒకరినొకరు ప్రేమ మరియు ఆప్యాయతతో పలకరించుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్‌కు చెందిన మరియం ఫాతిమా ఈ వీడియోను షేర చేశారు (Viral Video).
జమ్ము, కశ్మీర్‌లోని రావి నది ఇరు దేశాల మధ్య ప్రవహిస్తుంటుంది. ఆ నదికి అవతలి వైపున ఉన్న ఫాతిమా ఇవతలి ఒడ్డున ఉన్న సామాన్య భారతీయులతో మాట్లాడడానికి ప్రయత్నించారు. వారికి అభినందనలు తెలిపారు. వారికి చేతులతో సంజ్ఞలు చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సరిహద్దు వెంబడి నివసిస్తున్న భారతీయులతో ప్రేమపూర్వకంగా మాట్లాడేందుకు అంటూ 9 పద్ధతులను ఆమె వీడియో ద్వారా వివరించారు. ఆ వీడియో చాలా అందంగా, అద్భుతంగా ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 18 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 38 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ప్రజలు ఒకరినొకరు ప్రేమిస్తారు, కానీ రాజకీయ నాయకులే అసలు దోషులు``, ``మీరు భారతీయుడిని కలవాలనుకుంటే దుబాయ్‌కు రండి. వారు ఉత్తమ వ్యక్తులు``, ``చాలా అందమైన వీడియో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: బిజీ రోడ్డుపై డబ్బులు వెదజల్లిన యువకుడు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్!
IQ Test: మీ తెలివితేటలకు నిజమైన పరీక్ష.. ఈ సింపుల్ పజిల్‌ను 10 సెకెన్లలో సాల్వ్ చేయండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Aug 23 , 2024 | 08:32 AM