Parenting: పిల్లలు ఏం అడిగినా వద్దని చెబుతున్నారా? దీని పర్యవసానాలు తెలుసా?
ABN, Publish Date - Oct 01 , 2024 | 01:04 PM
పిల్లల పెంపకం చాలా సవాళ్లతో కూడుకుని ఉంటుంది. పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అనే విషయం నిర్ణయించుకోవడంలో తల్లిదండ్రులు గందరగోళానికి లోనవుతుంటారు.
నాన్నా బయటకు వెళ్లి ఆడుకుంటా అంటే వద్దు అని అంటాడు 10ఏళ్ళ వినయ్ తండ్రి..
అమ్మా మా నన్ను ఎగ్జిబిషన్ కు తీసుకెళ్లు అంటే వద్దంటుంది 12ఏళ్ల వినీల తల్లి..
అమ్మానాకు డ్రాయింగ్ నేర్చుకోవాలని ఉంది అంటే వద్దంటుంది 10ఏళ్ళ శ్యామ్ తల్లి..
నాన్నా పార్క్ కు తీసుకెళ్లు అంటే కుదరదు అంటాడు 9 ఏళ్ల అభి తండ్రి..
పిల్లలు చాక్లెట్ కావాలన్నా... ఆడుకుంటాం అన్నా.. పిక్నిక్ వెళ్తాం అన్నా.. పిల్లలు అడిగేవి మంచివి అయినా సరే.. కొందరు తల్లిదండ్రులు వద్దు అనే సమాధానం చెబుతూ ఉంటారు. ఇలాంటి తండ్రులకు సమయం లేక లేదా సమాజంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు చూసి భయపడో పిల్లలు ఇంట్లో కామ్ గా కూర్చుంటే అంతే చాలు అనుకుంటారు. కానీ పిల్లలు పెరిగేకొద్ది తల్లిదండ్రుల నుండి ఇలా వద్దు.. అనే మాట పదే పదే ఎదురైతే భవిష్యత్తుకే ప్రమాదమట.
30రోజులు వరుసగా ఖర్జూరాన్ని తింటే శరీరంలో కలిగే మార్పులివే..!
పిల్లల పెంపకం చాలా సవాళ్లతో కూడుకుని ఉంటుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారిని కనిపెట్టుకుని ఉండటానికి తల్లిదండ్రులు ఎంత జాగ్రత్త పడతారో.. పిల్లలు పెద్దయ్యే కొద్దీ వారి పెంపకం విషయంలో అంతకంటే ఎక్కువ కంగారు పడతారు. తల్లిదండ్రులు ఏం చేసినా, ఏం చెప్పినా పిల్లల మంచికోసమే అనే మాట చాలా మంది చెప్పేదే.. పిల్లలు అడిగేది వారికి నష్టం కలిగించేది అయితే దాని మంచి చెడులు వివరించి పిల్లలను సైలెంట్ చేయవచ్చు. కానీ పిల్లు అడిగేది మంచి విషయమైనా తల్లిదండ్రులు వద్దు అని చెబుతూ ఉంటారు.
పిల్లలు ఏది అడిగినా వద్దు అని చెబుతూ ఉంటే పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఏ విషయంలోనూ ఏమీ తెలియని అమాయకులుగా పిల్లలు పెరుగుతారు. కేవలం తల్లిదండ్రులు చెప్పిందే వినే పిల్లలు భవిష్యత్తు తమకు తాము ఏమీ చేయలేరు. సొంతంగా ఏమీ ఆలోచించలేరు.
అవకాడో తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసా?
తల్లిదండ్రులు అడిగే ప్రతి దానికి వద్దు అని చెబితే రెండు పరిణామాలు చోటు చేసుకుంటాయి.
మొదటిది పిల్లలు సైలెంట్ అయిపోతారు. కానీ తాము ఏం అడిగినా తమ పేరెంట్స్ వద్దంటారు, పేరెంట్స్ మంచి వాళ్లు కాదు అనే అభిప్రాయం పిల్లలలో నాటుకుపోతుంది. ఇది పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య బంధాన్ని దెబ్బతీస్తుంది.
రెండవది పిల్లలలో తిరుగుబాటు ధోరణి ఏర్పడుతుంది. పిల్లలు తల్లిదండ్రులతో వాదించడం, వారిని ప్రశ్నించడం వంటివి చేస్తారు. దీని వల్ల పిల్లలకు తల్లిదండ్రుల మీద వ్యతిరేక భావం, పెద్దల పట్ల నిర్లక్ష్య స్వభావం అలవడతాయి.
పిల్లలు ఏం అడిగినా వద్దనే సమాధానం చెబుతూ ఉంటే పిల్లలలో సృజనాత్మకత, వారి ప్రతిభ మరుగున పడిపోతుంది. వారు భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళ్లలేరు.
తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద ఎక్కువగా ఉండి, ప్రతి పని కూడా తల్లిదండ్రులే చెబుతూ ఉంటే అది పిల్లలలో భయాన్ని పెంచుతుంది. తల్లిదండ్రులు లేకుండా, వారి మాట వినకుండా ఏదైనా ఒక పనిని సొంతంగా చేయాలంటే వారు భయపడతారు. అలాంటి పరిస్థితిలో వారు ఏమైనా చేసినా అందులో వైఫల్యమే ఎదుర్కుంటారు.
ఇవి కూడా చదవండి..
శరీరంలో ప్రోటీన్ తగ్గిందో లేదో తెలుసుకోవడం ఎలా? ఈ లక్షణాలతో చెక్ చేసుకోండి..!
ఖాళీ కడుపుతో ఉదయాన్నే పసుపు నీటిని రోజూ తాగితే ఏం జరుగుతుందంటే..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 01 , 2024 | 01:04 PM