ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Olympics-2024: అథ్లెట్ల కోసం యాంటీ సెక్స్ బెడ్స్‌.. ప్లేయర్స్ రియాక్షన్ ఇదీ..

ABN, Publish Date - Jul 23 , 2024 | 06:48 PM

Paris Olympics 2024: ఒలింపిక్స్ గేమ్స్ అంటే ప్లేయర్స్, వారి సాధించిన పథకాలు.. ఆ గేమ్స్ పూర్వాపరాలకు సంబంధించిన వార్తలు బాగా వస్తాయి. కానీ, ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ ముంగిట ఒక అంశం దుమ్ము దుమారం రేపుతోంది. అదే యాంటీ సెక్స్ బెడ్స్.

Olympics-2024

Paris Olympics 2024: ఒలింపిక్స్ గేమ్స్ అంటే ప్లేయర్స్, వారి సాధించిన పథకాలు.. ఆ గేమ్స్ పూర్వాపరాలకు సంబంధించిన వార్తలు బాగా వస్తాయి. కానీ, ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ ముంగిట ఒక అంశం దుమ్ము దుమారం రేపుతోంది. అదే యాంటీ సెక్స్ బెడ్స్. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఒలింపిక్స్ సందర్భంలో అథ్లెట్స్ మధ్య సాన్నిహిత్యాన్ని నిరోధించాలనే ఉద్దేశ్యంలో నిర్వాహకులు ఈ యాంటీ సెక్స్ బెడ్స్‌ని ప్రవేశపెట్టారు. 2021లో టోక్యో గేమ్స్‌ సమయంలోనే మొదటిసారిగా ఈ యాంటీ సెక్స్ బెడ్స్‌ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ 2024కి కూడా ఈ బెడ్స్ వచ్చేశాయి. ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్న చోట అథ్లెట్ల మధ్య సాన్నిహిత్యాన్ని నిరోధించడానికి నిర్వాహకులు చేసిన ప్రయత్నంలో భాగంగా కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసిన బెడ్‌లను ప్రవేశపెట్టారు. వాస్తవానికి గత ఒలింపిక్స్ సమయంలో ఈ బెడ్స్‌ విషయంలో అథ్లెట్స్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ బెడ్స్ అసౌకర్యంగా ఉన్నాయని, ఇబ్బంది పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, వారి విమర్శలను పట్టించుకోకుండా పారిస్ ఒలింపిక్ గేమ్స్ నిర్వాహకులు సైతం ఈ బెడ్స్‌నే అథ్లెట్ల రూమ్స్‌లో ఏర్పాటు చేశారు.


అయితే, ఈ బెడ్స్‌ ఏర్పాటు చేయడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్లేయర్స్‌లో కొందరు వాటి గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఆస్ట్రేలియన్ టెన్నీస్ స్టార్స్‌ డారియా సవిల్లే, ఎల్లెన్ పెరెజ్ కొత్త యాంటీ సెక్స్ బెడ్‌లను స్వయంగా పరీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. ఆ బెడ్‌పై గేమ్ ప్రాక్టీస్ చేయడం, స్క్వాట్ జంప్‌లు, స్టెప్-అప్‌లు చేస్తూ హంగామా చేశారు. ‘ఒలింపిక్ విలేజ్‌లో కార్డ్‌బోర్డ్ బెడ్‌లను పరీక్షించాం.’ అని క్యాప్షన్ పెట్టి వీడియోను షేర్ చేశారు.


ఇక ఐరిష్ జిమ్నాస్ట్ రైస్ మెక్‌క్లెనాఘన్ కూడా తన బెడ్‌పై ప్రయోగాలు చేశారు. ఇదీ యాంటీ సెక్స్ బెడ్ అంటూ కామెంట్స్ పెట్టాడు. ‘నేను ఈ యాంటీ సెక్స్ బెడ్స్‌ని పరీక్షించాను. నా పరీక్షను తట్టుకున్నాయి. బహుశా నేను తగినంత స్ట్రాంగ్‌గా లేనేమో.’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే, ప్లేయర్ల నుంచి విమర్శలు అధికంగా వస్తుండటంతో ఈ యాంటీ సెక్స్ బెడ్స్‌ని పారిస్ ఒలింపిక్స్ గేమ్స్ నిర్వాహకులు తొలగించినట్లు తెలుస్తోంది. ఈ బెడ్స్‌ దృఢత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు అనిపించినప్పటికీ.. కొందరు అథ్లెట్లు తమకు తగినంత సౌకర్యంగా లేవని చెబుతున్నారు.


పారిస్ ఒలింపిక్స్‌లో టీమ్ ఇండియా..

జులై 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. ఇప్పటికే వీరంతా ఒలింపిక్ విలేజ్‌కి చేరుకున్నారు. ఈ గేమ్స్‌లో పాల్గొనే ప్లేయర్లకు ప్రధాని మోదీ సహా క్రీడా ప్రముఖులు బెస్ట్ విషెష్ చెప్పారు. పారిస్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేయాలని ఆకాంక్షించారు.


Also Read:

అన్ని వర్గాల అభివృద్ధి బడ్జెట్ ఇది... మోదీ

పాకిస్తాన్‌కు వెళ్లేందుకు మాస్టర్ ప్లాన్.. చివరకు?

ఆ లింకులపై క్లిక్ చేస్తే.. ఇక అంతే సంగతులు..!

For More Trending News and Telugu News..

Updated Date - Jul 23 , 2024 | 06:57 PM

Advertising
Advertising
<