Viral: 4 గంటల లేటుగా బయలుదేరిన ఫ్లైట్! ఎయిర్‌లైన్స్‌పై ప్రశంసలు! ఎందుకంటే..
ABN, Publish Date - Jun 22 , 2024 | 09:09 PM
విమానం నాలుగు గంటల పాటు ఆలస్యంగా బయలుదేరినా ఇండిగోపై ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది.
ఇంటర్నెట్ డెస్క్: విమానాలు కొన్ని గంటల పాటు ఆలస్యంగా బయలుదేరిన సందర్భాల్లో ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ మీద ఫైరైన ఘటనలు అనేకం వెలుగు చూశాయి. తాజాగా ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా దాదాపు 4 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. అయితే, ప్రయాణికులు మాత్రం సంస్థపై ప్రశంసలు కురిపిస్తూ నెట్టింట పోస్టులు పెట్టడం ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది.
Viral: నా సంస్థలోని తొలి ఉద్యోగిని తీసేశానంటూ సీఈఓ పోస్టు! నెట్టింట విమర్శలు
ఇటీవల ఢిల్లీ నుంచి బాగ్డోరా వెళ్లాల్సిన ఇండిగో విమానం నాలుగు గంటల ఆలస్యంగా బయలు దేరింది. ప్రయాణికులు అందరూ విమానంలోనే కూర్చుండిపోవాల్సిందే. అయితే, సంస్థ మాత్రం ప్రయాణికుల సౌకర్యం కోసం ఏసీ ఆన్‌లోనే ఉంచింది. అంతేకాకుండా, వారికి స్నాక్స్, మంచి నీళ్లు కూడా అందజేసింది. బోరు కొట్టకుండా ఉండేందుకు ఓ చిన్న సరదా ఆట కూడా ఆడించింది. ఇవన్నీ చెబుతూ ఓ ప్రయాణికుడు నెట్టింట పోస్టు పెట్టాడు. సంస్థపై ప్రశంసలు కురిపించాడు (Passenger Thanks IndiGo For Serving Snacks And Water During Flight Delay).
ఈ పోస్టుకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఆతిథ్యమంటే ఇలా ఉండాలని అనేక మంది కామెంట్ చేశారు. పరిశుభ్రత విషయంలో ఇండిగోకు మించినది లేదని కొందరు అన్నారు. కానీ కొందరు మాత్రం విమర్శలు ఎక్కుపెట్టారు. ఇండిగోలో కార్పొరేట్ మీల్స్ పేరిట రూ.300 వసూలు చేసి 4 సెంటీమీటర్ల బిస్కెట్, జ్యూస్ ఇస్తున్నారని, కనీసం శాండ్ విచ్ కూడా ఉండటం లేదని కొందరు ఆరోపించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.
Updated Date - Jun 22 , 2024 | 09:09 PM