Vande Bharat: వందే భారత్ ట్రైన్‌లోని ఆహారంలో బొద్దింక.. వైరల్ అవుతున్న ఫొటోలు!
ABN, First Publish Date - 2024-02-07T21:26:18+05:30
రైళ్లలో అందించే ఆహారం నాణ్యతపై తరచుగా ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. ఎన్ని ఫిర్యాదులు అందినా మళ్లీ మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉంటాయి.
ప్రతిరోజూ కొన్ని వేల మంది రైళ్లలో (Trains) ప్రయాణాలు చేస్తుంటారు. సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారు రైళ్లలో దొరికే ఆహారాన్నే తింటుంటారు (Food in Trains). ఆ ఆహారం నాణ్యతపై తరచుగా ఫిర్యాదులు వస్తూ ఉంటాయి. ఎన్ని ఫిర్యాదులు అందినా మళ్లీ మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం అవుతునే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైళ్లలో (Vande Bharat Trains) అందించే ఫుడ్‌పై కూడా తరచుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.
శుభేందు కేశరి అనే వ్యక్తి ఈ నెల ఒకటో తేదీన కమలపాటి నుంచి జబల్‌పూర్ జంక్షన్ వరకూ వందేభారత్ రైల్లో ప్రయాణించాడు. ప్రయాణ సమయంలో ఐఆర్‌సీటీసీ (IRCTC) నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు. కొద్ది సేపటికి ఫుడ్ ప్యాకెట్ వచ్చింది. దానిని తెరిచి చూడగా ఆహారంలో చచ్చిన బొద్దింక కనిపించింది (Cockroach in food). షాక్ అయిన శుభేందు వెంటనే ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సోషల్ మీడియా ద్వారా రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఐఆర్‌సీటీసీ వెంటనే స్పందించింది.
సదరు ప్రయాణికుడికి ఐఆర్‌సీటీసీ క్షమాపణలు చెప్పింది. ఆహారాన్ని సప్లై చేసిన సర్వీస్ ప్రొవైడర్‌కు భారీ జరిమానా విధించినట్లు తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొంది. కాగా, ఈ ఘటనపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా రైళ్లలో ఫుడ్ పరిస్థితి మారదని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2024-02-07T21:26:20+05:30 IST