Viral Video: ఈ పేదవాడి మనసు చాలా పెద్దది.. చెప్పులు కుట్టే ఈ వ్యక్తి కోసం ఎంతో మంది ఎందుకు స్పందించారంటే..
ABN, Publish Date - Sep 21 , 2024 | 01:25 PM
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో చిన్న షాప్‌లో చెప్పులు కుట్టే వృద్ధ కార్మికుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి పేరు రామయ్య. అతను ఎన్నో ఏళ్లుగా అదే ప్రాంతంలో చెప్పులు కుడుతున్నాడు. అతడి సంపాదనే తక్కువ.
బెంగళూరు (Bengaluru)లోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో చిన్న షాప్‌లో చెప్పులు కుట్టే వృద్ధ కార్మికుడు (Old Cobbler) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి పేరు రామయ్య. అతను ఎన్నో ఏళ్లుగా అదే ప్రాంతంలో చెప్పులు కుడుతున్నాడు. అతడి సంపాదనే తక్కువ. అలాంటిది అతడు వీధి కుక్కలకు (Stray Dogs) ఆశ్రయం కల్పిస్తూ, ఆహారం అందిస్తూ, వాటి బాగోగులు చూస్తున్నాడు. అతడి గురించి తెలుసుకున్న ఓ మహిళ 2023లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో అతడి కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral News).
ఆ మహిళ రామయ్య కథ మొతాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రామయ్యకు సహాయం చేయాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. ఆ పోస్ట్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. ``వైట్ ఫీల్డ్‌లో చిన్న దుకాణం ఉన్న రామయ్య అంకుల్ ఆ స్థలంలో షూస్ రిపేర్ చేయడమే కాకుండా నాలుగు కుక్కలు, పిల్లి పిల్లకు ఆశ్రయం ఇస్తున్నాడు. కొన్నాళ్లుగా వారికి ఆహారం పెడుతున్నాడు. వారి సంరక్షణలో ఉన్నాడు. వారు అనారోగ్యంతో లేదా గాయపడినప్పుడల్లా ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు. వారిని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు`` అని సోషల్ మీడియా ద్వారా పేర్కొంది.
``బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో డెకాథ్లాన్ వెలుపల చిన్న దుకాణం ఉంది. మీరు ఎప్పుడైనా అటు వైపు వెళితే నిజమైన ప్రేమ, దయ, దాతృత్వం ఎలా ఉంటుందో చూడటానికి మీరు ఒక సెకను తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అతని కోసం డబ్బు సేకరించాలని నిర్ణయించుకున్నాను. అతడికి సహాయం చేసేందుకు దేశం నలుమూలల నుంచి చాలా మంది ముందుకు వచ్చార``ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: షాకింగ్ వీడియో.. కళ్ల ముందే భూమిలోకి వెళ్లిపోయిన ట్రక్.. డ్రైవర్ ఎలా బయటపడ్డాడంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 21 , 2024 | 01:25 PM