ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: టాలెంట్ ఉన్నా లైఫ్‌లో ముందుకెళ్లట్లేదా? కారణాలు ఇవే!

ABN, Publish Date - Nov 15 , 2024 | 08:33 PM

మేధావులైన అనేక మంది ఎంత టాలెంట్ ఉన్నా లైఫ్‌లో ముందడుగు వేయలేక ఇబ్బంది పడుతుంటారు. చేస్తున్న పనులు ఆశించిన ఫలితాలు ఇవ్వక నిరాశకు లోనవుతుంటారు. ఇలాంటి వాళ్లు తెలీక చేసే కొన్ని పొరపాట్లే దీనికి కారణమని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మేధావులైన అనేక మంది ఎంత టాలెంట్ ఉన్నా లైఫ్‌లో ముందడుగు వేయలేక ఇబ్బంది పడుతుంటారు. చేస్తున్న పనులు ఆశించిన ఫలితాలు ఇవ్వక నిరాశకు లోనవుతుంటారు. ఇలాంటి వాళ్లు తెలీక చేసే కొన్ని పొరపాట్లే దీనికి కారణమని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమ ప్రవర్తనలో, ఆలోచనా ధోరణిలో కొన్ని ప్రతికూలతలను గుర్తించలేక పదే పదే వైఫల్యాలు మూటగట్టుకుంటూ ఉంటారు (Lifestyle).

ప్రతి పని 100 శాతం అద్భుతంగా చేయాలనే తపన కొందరిని విజయానికి దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫర్‌ఫెక్ట్‌గా ఉండాలనే ప్రయత్నం చివరకు వ్యసనంగా మారి విజయానికి అడ్డంకిగా మారుతుందట. తప్పులు చేస్తామేమోనన్న భయం వారిని రిస్క్‌ తీసుకోనీయక, కొత్త విషయాలవైపు వెళ్లకుండా అడ్డుకుని విజయానికి దూరం చేస్తుందని చెబుతున్నారు.

Viral: అసలైన ప్రేమంటే ఇదీ.. చూపు లేని గర్ల్‌ఫ్రెండ్‌కు ఊహించని సర్‌ప్రైజ్!


చేసే ప్రతి పని గురించి అతిగా ఆలోచించడం కూడా పురోగతికి ఓ ప్రధాన అడ్డంకిగా మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి కోణాన్ని అతిగా విశ్లేషించి ముందడుగు వేయలేక చివరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోతారని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అనవసర ఆలోచనలు పక్కనపెట్టి ముందడుగు వేస్తే విజయం దానంతట అదే వస్తుందని చెబుతున్నారు. సమస్యల గురించి వేగంగా ఆలోచించి, అంతేవేగంగా పరిష్కారాలు అమలు చేస్తే విజయావకాశాలు పెరుగుతాయట.

వైఫల్యం ఎదురవుతుందనే భయం కూడా మేధావులను ముందడుగు వేయనీయదని నిపుణులు చెబుతున్నారు. చిన్నతనంలో ఎదురైన అనుభవాల తాలుకు ప్రభావం ఈ తరహా మనస్తత్వానికి దారి తీస్తుందని అంటున్నారు. లైఫ్‌లో ఎదురుదెబ్బలకు భయపడి సులువైన మార్గాన్ని ఎంచుకునే వారు విలువైన జీవితానుభవాన్ని కోల్పోతారు. తద్వారా విజయావకాశాలు కూడా తగ్గిపోతాయట.

Viral: ఏంటీ.. ఇది భారతీయ ఎయిర్‌పోర్టా! జపాన్ యువతి షాక్!


జీవితంలో ఎదుగుదలకు మేధోశక్తి ఎంత అవసరమో భావోద్వేగ పరిణితి కూడా అంతే అవసరమని నిపుణులు చెబుతున్నారు. మనోభావాలపై నియంత్రణతో పాట ఎదుటి వారి మనస్తత్వాల్ని అంచనా వేయగలిగే పరిణితి సాధిస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి జీవితంలో విజయం మరింత సులువవుతుందని చెబుతున్నారు.

పనిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అలవాటు ఉన్న వారు దీర్ఘకాలంలో అనారోగ్యాల పాలపడి శక్తియుక్తులు కోల్పోతారని హెచ్చరిస్తు్న్నారు. ఎంతటి బిజీలో ఉన్నా కడుపునిండా పోషకాహారం, కంటినిండా నిద్రను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

మార్పును స్వీకరించలేకపోవడం కూడా ఎదుగుదలకు ప్రధాన అడ్డంకని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు వెరవడం వంటి ధోరణులు పురోగతికి గొడ్డలి పెట్టని హెచ్చరిస్తున్నారు. మేధావుల్లో కొందరు తమకు తెలిసిన పద్ధతులను కొనసాగించేందుకు, అలవాటైన వాతావరణానికి కట్టుబడి ఉండేందుకు ప్రయత్నిస్తారని, ఇది కూడా వారి పురోగతికి నిరోధకంగా మారుతుందని చెబుతున్నారు.

మేధావుల్లో అనేక మంది అంతర్ముఖులుగా ఉంటారని, ఏకాంతాన్ని ఆస్వాదిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇలా స్వతంత్రంగా ఉండటమే వారి బలమైనప్పటికీ నలుగురినీ కలుపుకుని నడిస్తే విజయావకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు.

Read Latest and Viral News

Updated Date - Nov 15 , 2024 | 08:33 PM