ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Personality Test: మీ వేలి ముద్ర ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో చెప్పేయచ్చట.. ఒకసారి చెక్ చేసుకోండి..!

ABN, Publish Date - Jul 27 , 2024 | 12:30 PM

చేతి వేలి ముద్రల ఆకారాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వారో చెప్పేయచ్చని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు అంటున్నారు.

Finger Print

ఏ ఇద్దరు వ్యక్తుల వేలి ముద్రలు ఒకే విధంగా ఉండవని చెబుతారు. ఉందుకే ఆర్థిక సంబంధ విషయాల్లో అయినా, నేరాలకు సంబంధించి అయనా వేలి ముద్రలను ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు. అయితే చేతి వేలి ముద్రల ఆకారాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వారో చెప్పేయచ్చని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు అంటున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

వేలి ముద్ర ఆకారం ఎలా కనుక్కోవచ్చంటే..

వేలిముద్ర ఆకారాన్ని స్పష్టంగా కనుక్కోవడానికి చేతి వేలికి సిరాను పూయవచ్చు. ఇలా పూసిన తరువాత తెల్లని కాగితం మీద వేలి ముద్ర వేస్తే ముద్ర ఆకారం కనిపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా చాక్ పీస్ డస్ట్ ను కూడా వేలికి పూయవచ్చు. వేలి మీద గీతలు స్పష్టంగా కనిపిస్తాయి.

Foot Fungal Infection: మధుమేహం ఉన్నవారికి అలర్ట్.. వర్షాకాలంలో వచ్చే ఈ సమస్యతో పెద్ద ముప్పే..!



ఏ ఆకారం దేన్ని సూచిస్తుంది?

వేలి ముద్రలు సాధారణంగా మూడు రకాలుగా ఉంటాయి.

  • శంఖు ఆకారం..

  • అడ్డు గీతలు..

  • వంపు గీతలు..

శంఖు ఆకారం..

శంఖు ఆకారం వేలి ముద్రలు ఉన్న వ్యక్తులు ప్రశాంతమైన, నిర్మలమైన స్వభావం కలిగి ఉంటారట. తాము ఎప్పుడూ వెనుకబడ్డామనే ఆలోచన వారిలో ఉంటుందట. పనులు ప్రారంభించడంలో కష్టపడతారు. సానుభూతి ద్వారా స్నేహితులను సంపాదిస్తారు. బాధ్యతగా, నిజాయితీగా ఉంటామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వీరు పగటి కలలలో, ఊహల్లో బ్రతికేస్తుంటారు. రోజువారీ పనులను బోర్ గా భావిస్తారు. ఈ కారణంగా ఉద్యోగాలలో కూడా వీరు నిలకడగా ఉండరు.

Walking Tricks: ఈ 5 ట్రిక్స్ ఫాలో అయితే చాలు.. వాకింగ్ లో ఎక్కువ కేలరీలు బర్న్ చేయవచ్చు..!



వంపు గీతలు..

వంపు గీతల వేలి ముద్రలు సముద్రపు అలలను పోలి ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు చాలా శక్తివంతంగా, ఆచరణాత్మకంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వారు ఏదైనా నిర్ణయం తీసుకున్న తరువాత దాని నుండి వారిని తప్పించడం కష్టం. వారికున్న నమ్మకాల పట్ల, స్నేహితుల పట్ల చాలా నిజాయితీగా,నమ్మకంగా ఉంటారు. సోమరితనాన్ని ఇష్టపడరు. ఆకస్మిక మార్పులకు అణుగుణంగా ఉండరు.

వృత్తాకారం..

వృత్తాకారంలో వేలి ముద్రలు ఉన్నవారు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వార వారికి నచ్చిన మార్గంలో పనులు చేయడానికి ఇష్టపడతారు. రిజర్వ్డ్ గా ఉంటారు. కాస్త స్వార్థంతో ఉంటారు. స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరి దగ్గరా ఓపెన్ కావడం వీరికి ఇష్టముండదు. వీరిలో ఉన్న తెలివి, ప్రతిభ, పదునైన ఆలోచనలు వీరిని విజయానికి చేరువ చేస్తాయి. పరిసరాలను తమ విజయం కోసం ఉపయోగించుకోవడం ఎలాగో వీరికి బాగా తెలుసు.

BP: ఈ ఆహారాలతో జాగ్రత్త.. ఇవి బీపీని అమాంతం పెంచేస్తాయ్..!

Health Tips: చిన్న వయసులోనే పెద్ద వారిలా కనబడుతున్నారా? ఈ నాలుగు అలవాట్లే కొంప ముంచుతున్నాయ్..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.


Updated Date - Jul 27 , 2024 | 12:30 PM

Advertising
Advertising
<