తాత్విక ‘చిత్రాలు’
ABN, Publish Date - Oct 20 , 2024 | 10:44 AM
అనంత శయన విష్ణు, ద్వారకా తిరుమల, వినాయక రథోత్సవం, ఆబాల గోపాలుడు... అన్నీ తాత్విక రేఖలే. చిత్రకళా రంగంలో ‘కాలిగ్రఫీ’ అనేది ప్రత్యేకమైన శైలి. పెన్నుతోగానీ, బ్రష్‌తో గానీ ఒక పద్ధతిలో అక్షరాలను చెక్కినట్టుగా, ఫ్రీహ్యాండ్‌గా బొమ్మలను గీయాల్సి ఉంటుంది.
అనంత శయన విష్ణు, ద్వారకా తిరుమల, వినాయక రథోత్సవం, ఆబాల గోపాలుడు... అన్నీ తాత్విక రేఖలే. చిత్రకళా రంగంలో ‘కాలిగ్రఫీ’ అనేది ప్రత్యేకమైన శైలి. పెన్నుతోగానీ, బ్రష్‌తో గానీ ఒక పద్ధతిలో అక్షరాలను చెక్కినట్టుగా, ఫ్రీహ్యాండ్‌గా బొమ్మలను గీయాల్సి ఉంటుంది. ఈ కళలో పూసపాటి పరమేశ్వర రాజుది చేయి తిరిగిన గీత. తన 40 ఏళ్ల అనుభవాన్ని రంగరించి... కాలిగ్రఫీకి తాత్వికతను జోడించి ఆయన చేసిన ప్రయోగాలకు పుస్తక రూపం ‘వండర్‌ఫుల్ కాలిగ్రఫీ’. 436 పేజీల ఈ పుస్తక కాన్వాసులో 457 చిత్రాలున్నాయి. స్థల పురాణాలు, పురాణ ఇతివృత్తాలు, దేవతామూర్తుల కాలిగ్రఫీ... భారతీయ సంస్కృతికి జీవం పోస్తూ ఆధునిక ధోరణిలో కనువిందు చేస్తాయి.
Updated Date - Oct 20 , 2024 | 10:44 AM