Plastic Box: ప్లాస్టిక్ బాక్సుల వెనుక నెంబర్లను గమనించారా? ఏ నెంబర్ ఉంటే ఎలా వాడాలంటే..!
ABN, Publish Date - Jun 03 , 2024 | 01:10 PM
అభిపృద్ది చెందుతున్న టెక్నాలజీలో ప్లాస్టిక్ వాడకం కూడా దారుణంగా పెరిగిపోయింది. చిన్న షాపుల నుండి సూపర్ మార్కెట్ల వరకు ప్రతి ఒక్కచోటా ప్లాస్టిక్ బాక్సులు గుట్టల కొద్దీ అమ్మడం కనిపిస్తుంటుంది. చవగ్గా లభిస్తాయి కదా అని చాలామంది ప్లాస్టిక్ బాక్సులు చాలా ఎక్కువ వాడుతుంటారు. కొందరు ఈ ప్లాస్టిక్ బాక్స్ లను ఆహారం తీసుకెళ్లడానికి కూడా వినియోగిస్తుంటారు. అయితే వీటి వెనక ఉండే నెంబర్లు ఏం చెప్తున్నాయంటే..
అభిపృద్ది చెందుతున్న టెక్నాలజీలో ప్లాస్టిక్ వాడకం కూడా దారుణంగా పెరిగిపోయింది. చిన్న షాపుల నుండి సూపర్ మార్కెట్ల వరకు ప్రతి ఒక్కచోటా ప్లాస్టిక్ బాక్సులు గుట్టల కొద్దీ అమ్మడం కనిపిస్తుంటుంది. చవగ్గా లభిస్తాయి కదా అని చాలామంది ప్లాస్టిక్ బాక్సులు చాలా ఎక్కువ వాడుతుంటారు. కొందరు ఈ ప్లాస్టిక్ బాక్స్ లను ఆహారం తీసుకెళ్లడానికి కూడా వినియోగిస్తుంటారు. అయితే ఇలా ఆహారం తీసుకెళ్లడానికి ఎలాంటి ప్లాస్టిక్ బాక్సులు వినియోగించాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ప్లాస్టిక్ బాక్సుల మీద ఉన్న నెంబర్లను బట్టి దీన్ని నిర్ణయించవచ్చట. ఇంతకీ ఈ నెంబర్లేమిటో తెలుసుకుంటే..
తేనె Vs బ్రౌన్ షుగర్.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..!
ప్రతి ప్లాస్టిక్ బాక్స్ వెనుక దాని నంబర్ రాసి ఉంటుంది. ఇది బాక్స్ నాణ్యతను చూపుతుంది. ఏదైనా పెట్టెపై 3, 6 లేదా 7 నంబర్ రాసి ఉంటే దానిని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే వేడిచేసిన ఆహారాలు, పానీయాలు ఈ ప్లాస్టిక్ బాక్సులలో వేసినప్పుడు అవి హానికరమైన పదార్థాలను విడుదల చేస్తాయి.
ఆహారాన్ని, పానీయాలను తీసుకెళ్లడానికి ప్లాస్టిక్ కంటైనర్లను కొనుగోలు చేసే ముందు సంఖ్యకు ప్రాముఖ్యత ఇవ్వడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, పెట్టె వెనుక భాగంలో త్రిభుజాకార ఆకారంలో 1 అని వ్రాసినట్లయితే, అది ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడుతుందని అర్థం. ఒకటి కంటే ఎక్కువసార్లు వాడితే శరీరానికి హాని కలుగుతుంది.
6 సెకెన్ల ముద్దుకు ఇంత పవరుందా?
ఇంట్లో ప్లాస్టిక్ వాడకుండా ఉండటానికి ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు అది అవసరం అవుతుంది. అలాంటి పరిస్థితిలో తిరిగి ఉపయోగించుకోగల ప్లాస్టిక్ కంటైనర్లను కొనుగోలు చేయాలనుకుంటే, బాక్లుల వెనుక వైపు 2, 4, 5 అని వ్రాసినవి ఎంపిక చేసుకోవాలి. ఈ నంబర్ ఉన్న ప్లాస్టిక్ కంటైనర్లను మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చు. ఇవి ఆరోగ్యానికి హాని కలిగించవు.
కొందరు ఫ్రిజ్ లో పదార్థాలను నిల్వ చేయడానికి ప్లాస్టిక్ కంటైనర్లు ఉపయోగిస్తారు. ఫ్రీజర్‌లో ఉపయోగించడానికి ప్లాస్టిక్ బాక్సులను కొనుగోలు చేస్తుంటే కంటైనర్‌పై ఫ్రీజర్ సేఫ్ అని రాసి ఉందో లేదో తనిఖీ చేయాలి. ఇది కాకుండా బాక్స్ వెనుక భాగంలో కప్పు, ఫోర్క్ గుర్తులు ఉన్న పెట్టెలు ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించవచ్చు.
ఈ పానీయాలు తాగితే చాలు.. మానసిక ఒత్తిడి మటాష్..!
మైక్రోవేవ్ కోసం ప్లాస్టిక్ బాక్స్ ను కొనుగోలు చేసేముందు బాక్స్ వెనుకవైపు వేవ్ మార్క్ ఉన్న దానిని మాత్రమే కొనాలి. ఎందుకంటే ఈ గుర్తులు మైక్రోవేవ్ సురక్షితమని సూచిస్తాయి. ఇది కాకుండా పెట్టెపై నీటి ఆకారం ఉంటే అది పాత్ర 'డిష్‌వాషర్' సురక్షితంగా ఉందని సూచిస్తుంది. కాబట్టి మీరు దానిని డిష్ వాషర్ కోసం కొనుగోలు చేయవచ్చు.
6 సెకెన్ల ముద్దుకు ఇంత పవరుందా?
తేనె Vs బ్రౌన్ షుగర్.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jun 03 , 2024 | 01:10 PM