Viral Video: కుండ నీరు బాగా చల్లగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.. వైరల్ అవుతున్న వీడియో!
ABN, Publish Date - May 05 , 2024 | 01:26 PM
ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటేశాయి. మండుతున్న ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. వేసవిలో తాగే చల్లటి నీరు గొంతును మాత్రమే కాకుండా మనసును కూడా సంతృప్తిపరుస్తుంది. అయితే చాలా మంది ఫ్రిజ్‌లోని కూలింగ్ వాటర్‌ను తాగడానికి ఇష్టపడరు.
ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు (Summer) 40 డిగ్రీలను దాటేశాయి. మండుతున్న ఎండలు (Heat Wave) ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. వేసవిలో తాగే చల్లటి నీరు (Cooling Water) గొంతును మాత్రమే కాకుండా మనసును కూడా సంతృప్తిపరుస్తుంది. అయితే చాలా మంది ఫ్రిజ్ (Fridge)లోని కూలింగ్ వాటర్‌ను తాగడానికి ఇష్టపడరు. అలాంటి వారికి కుండలోని నీరే (Pot Water) ఉత్తమం. కుండ నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. కుండలోని నీటిని చల్లగా మార్చే ట్రిక్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
desi.mizaj అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో మహిళ కుండ నీరు చల్లగా ఉండేందుకు ఉపయోగించాల్సిన ట్రిక్‌ను వివరిస్తోంది. ముందుగా ఆమె కుండను బాగా కడిగింది. అనంతరం కుండలో నీటిని నింపి అందులో ఉప్పు వేసింది. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఆ నీటిని పారబోసి కుండను బాగా కడిగింది. అనంతరం కుండను మంచి నీటితో నింపింది. ఆ కుండను తడి ఇసుకపై ఉంచింది. అనంతరం ఆ కుండ నీటిలో పటికను వేసి కాసేపు తిప్పింది.
ఈ ట్రిక్స్ పాటిస్తే కుండలోని నీరు బాగా కూలింగ్ ఎక్కుతుందని చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించింది. 1.1 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``పటికతో తిప్పడం వల్ల ఉపయోగం ఏంటి``, ``కుండ నీరు చాలా మంచిది``, ``ఈ ట్రిక్ చాలా ఉపయోగకరం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: మీ పరిశీలనా శక్తికి అసలైన పరీక్ష.. ఈ ప్లే గ్రౌండ్‌లో టీపాట్ ఎక్కడుందో కనిపెట్టండి!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 05 , 2024 | 01:26 PM