ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గుర్రాలపై రొయ్యల వేటకు సై...

ABN, Publish Date - Sep 01 , 2024 | 11:13 AM

గుర్రాలెక్కి సరదాగా షికారుకి వెళతారు. కానీ బెల్జియంలోని వూస్తడ్యన్‌కెర్కెలో మాత్రం సముద్రంలో రొయ్యల వేటకి వెళతారు. అదేంటీ... చేపలు, రొయ్యల వేటకు పడవల్లో కదా వెళ్లాల్సింది అంటారా? అదో సంప్రదాయం అంతే. 500 ఏళ్ల క్రితం మొదలైన ఈ వేట నేటికీ కొనసాగడం విశేషం.

గుర్రాలెక్కి సరదాగా షికారుకి వెళతారు. కానీ బెల్జియంలోని వూస్తడ్యన్‌కెర్కెలో మాత్రం సముద్రంలో రొయ్యల వేటకి వెళతారు. అదేంటీ... చేపలు, రొయ్యల వేటకు పడవల్లో కదా వెళ్లాల్సింది అంటారా? అదో సంప్రదాయం అంతే. 500 ఏళ్ల క్రితం మొదలైన ఈ వేట నేటికీ కొనసాగడం విశేషం. అక్కడి నార్త్‌సీలో వారానికి రెండుసార్లు మత్స్యకారులు గుర్రాలపై సముద్రంలోకి వెళతారు. గుర్రాలకి పొడవాటి తాడు దానికి పెద్ద కొక్కెం, వెడల్పాటి వల... మొదలైనవి ఉంటాయి. సముద్ర అలలకు వల విచ్చుకునేలా ఏర్పాటు చేస్తారు. గుర్రం నడుములోపు సముద్రంలోకి వెళ్లి ఆగిపోతారు. అరగంట తరవాత తీరానికి వచ్చి జలసంపదను జల్లెడ పడతారు.


రొయ్యలను మాత్రం బుట్టలో వేసుకుని మిగిలిన జలచరాలను తిరిగి నీళ్లలోకి వదిలేస్తారు. ఒకప్పుడు యూరప్‌ తీరాల్లో ఇలాంటి వేట కనిపించేది. కానీ యంత్రాల వల్ల కనుమరుగైంది. బెల్జియంలో మాత్రం ఇంకా కొనసాగుతోంది. గుర్రాల విచిత్ర విన్యాసాన్ని చూసేందుకు పర్యాటకులూ వస్తుంటారు. బలమైన గుర్రం, సముద్రం... ఈ రెండిటినీ చక్కగా అర్థం చేసుకోగల రౌతు ఈ కళాత్మక వేటకు కీలకం. యునెస్కో అంతరించిపోతున్న వారసత్వం (ఇన్‌టాంజిబుల్‌ హెరిటేజ్‌) లిస్టులో స్థానం పొందిందీ రొయ్యల వేట.

Updated Date - Sep 01 , 2024 | 11:13 AM

Advertising
Advertising