ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఇంట్లోని పూజ గదిలో ఒంటరిగా ప్రసవించిన గర్భిణి.. ఆ వెంటనే ఆమె చేసిన పని తెలుసుకుని అంతా షాక్..

ABN, Publish Date - Jan 21 , 2024 | 03:25 PM

బిడ్డకు జన్మనివ్వడమనేది.. మహిళకు పునర్జన్మ వంటిది. నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. తన ప్రాణం పోయినా పర్లేదు తన బిడ్డ బాగుంటే చాలు అని అనుకుంటుంది. తన పిల్లలకు ఆపద వస్తే తన ప్రాణం అడ్డు పెట్టి అయినా వారిని కాపాడుకుంటుంది. అయితే ...

బిడ్డకు జన్మనివ్వడమనేది.. మహిళకు పునర్జన్మ వంటిది. నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. తన ప్రాణం పోయినా పర్లేదు తన బిడ్డ బాగుంటే చాలు అని అనుకుంటుంది. తన పిల్లలకు ఆపద వస్తే తన ప్రాణం అడ్డు పెట్టి అయినా వారిని కాపాడుకుంటుంది. అయితే అందరు తల్లులు ఇలాగే ఉంటారా అంటే.. లేదు అనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కొందరు మహిళలు చేసే పనులు.. మొత్తం మహిళా లోకానికే చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంటాయి. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు నిత్యం అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ మహిళ ఇలాంటి పనే చేసింది. వివరాల్లోకి వెళితే..

ఇండోనేషియా (Indonesia) పరిధిలోని పశ్చిమా జావా ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ గర్భిణి మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఆమెకు పురటినొప్పులు అనుభవించింది. అయితే అదృష్టవశాత్తు ఆమె క్షేమంగా ప్రసవించింది. ఒంటరిగానే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ ఆ వెంటనే ఊహించని నిర్ణయం తీసుకుంది. బిడ్డను ముద్దాడి మురిసిపోవాల్సింది పోయి.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది.

Viral Video: హోటల్ గదిలో చప్పుడు రావడంతో చూసేందుకు వెళ్లారు.. తీరా కిటికీలో నుంచి తొంగిచూడగా..

పుట్టిన బిడ్డకు బొడ్డు కూడా కోయకుండానే బయటికి తీసుకెళ్లి ఇంటి ఆవరణలో పడేసింది. తర్వాత ఏమీ ఎరుగనట్లు ఉండిపోయింది. పాప ఏడుస్తుండడంతో చుట్టు పక్కల వారు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శిశువును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిశువు నెలలు నిండకుండానే జన్మించిందని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా తల్లిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బిడ్డకు జన్మనిచ్చిన మహిళ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: చూసేందుకు ఇసుకలో పిల్లల ఆటల్లా ఉన్నా.. చూస్తుండగానే వేడి వేడి కాఫీ ఎలా చేశాడో చూడండి..

Updated Date - Jan 21 , 2024 | 03:25 PM

Advertising
Advertising