ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pre-Installed Apps: బాబోయ్.. కొత్త ఫోన్ల లో ముందే ఇన్స్టాల్ చేసిన యాప్స్ వెనుక ఇంత దారుణ మోసమా? వీటిని అలాగే వదిలేస్తే జరిగేదిదే..!

ABN, Publish Date - May 16 , 2024 | 03:48 PM

కొత్తగా కొన్న ఫోన్ లో ముందే కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి. వాటిలో చాలావరకు యాప్స్ ను డిలీట్ చేయడం కూడా కుదరదు. అందుకే చాలామంది వీటి గురించి పట్టించుకోకుండా అలాగే వదిలేస్తుంటారు. అయితే ఈ యాప్స్ వెనుక దారుణమైన మోసాలు బయటపడుతున్నాయి.

కొత్త ఫోన్లు కొనడం ఇప్పట్లో అందరికీ అలవాటైపోయింది. కొందరు ప్యాషన్ కోసం ఫోన్లు పదే పదే మారుస్తూ ఉంటారు. మరికొందరు అవసరం కోసం కొంటూ ఉంటారు. ఫోన్ లు ఎలా కొన్నా సరే.. కొత్తగా కొన్న ఫోన్ లో ముందే కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి. వాటిలో చాలావరకు యాప్స్ ను డిలీట్ చేయడం కూడా కుదరదు. అందుకే చాలామంది వీటి గురించి పట్టించుకోకుండా అలాగే వదిలేస్తుంటారు. అయితే ఈ యాప్స్ వెనుక దారుణమైన మోసాలు జరుగుతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. సాక్షాత్తూ స్మార్ట్ ఫోన్ సంస్థల సహకారంతోనే ఈ మోసాలు జరగడం ప్రజలను షాక్ కు గురిచేస్తోంది. అసలు కొత్త పోన్లలో ముందే ఇన్స్టాల్ చేయబడిన యాప్స్ వెనుక ఉన్న భాగోతం తెలుసుకుంటే..

ఓ పరిశోధన ప్రకారం చాలా కంపెనీ ఫోన్ లలో ప్రీ-ఇన్స్టాల్ చేసిన యాప్ లు వినియోగదారుల డేటాను తమ సర్వర్ లలో రహస్యంగా నిల్వ చేస్తున్నాయట. ఈ యాప్ లు స్క్రీన్ సైజ్, వెబ్ యాక్టివిటీ, ఫోన్ కాల్ లు, డివైజ్ ఐడెంటిఫైయర్ మొదలైన సమాచారాన్ని స్టోర్ చేస్తాయి. భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉపయోగింపబడిన అన్ని రకాల ఫోన్లలో ఈ పరిశోధన చేసి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. విచిత్రం ఏమిటంటే గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ యాప్ లు ఈ లిస్ట్ లో ఉండటం.

ఆహారంలో బెల్లం చేర్చుకోవాలని చెప్పే 10 బలమైన కారణాల లిస్ట్ ఇదీ..!


కొన్ని ఫోన్లలో ముందే ఇన్ స్టాల్ చేసిన యాప్ లను అన్ ఇన్స్టాల్ చేయడం కుదరదు. ముఖ్యంగా చవక ఫోన్లలో ముందే ఇన్స్టాల్ చేయబడిన యాప్స్ ఫోన్ లో యాప్ స్క్రీన్ వివరాలను కంపెనీలకు పంపుతాయి. అందులో ఫోన్ లో ఒక్కో యాప్ లో గడిపిన సమయం గురించి కూడా సమాచారం ఉంటుంది. ఈ డేటా ప్రపంచంలో నలుమూలల ఎన్నో దేశాలకు కూడా లీకవుతుండటం షాక్ కు గురిచేసే విషయం.

ఇప్పట్లో కొనే స్మార్ట్ ఫోన్లలో ఫేస్ బుక్, అమెజాన్, గూగుల్, వాట్సప్, స్పాటిపై వంటి యాప్ లు ముందే ఇన్స్టాల్ చేయబడి ఉంటున్నాయి. ఇవే కాదు ఫోన్లో ముందే ఇన్స్టాల్ చేయబడిన ఏ యాప్ అయినా దాన్ని వెంటనే అన్ ఇన్స్టాల్ చేసి ఆ తరువాత గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్స్ ను మళ్లీ ఇన్స్టాల్ చేసుకుని తర్వాత లాగిన్ కావడం మంచిది.

మీకూ నాలుక తెల్లగా ఉంటుందా? దీనికి అసలు కారణాలు ఇవే..!

తలనొప్పి ఎందుకు వస్తుంది? ఇదిగో ఇవే అతిపెద్ద 6 కారణాలు..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 16 , 2024 | 03:48 PM

Advertising
Advertising