Viral Video: షాకింగ్ వీడియో.. కళ్ల ముందే భూమిలోకి వెళ్లిపోయిన ట్రక్.. డ్రైవర్ ఎలా బయటపడ్డాడంటే..
ABN, Publish Date - Sep 21 , 2024 | 07:38 AM
మహారాష్ట్రలోని పుణెలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పుణె మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ట్రక్కు ఉన్నట్టుండి భూమిలోకి కూరుకుపోయింది. అంత పెద్ద ట్రక్కు హఠాత్తుగా తల్లకిందులుగా భూమిలో పడిపోయింది.
మహారాష్ట్రలోని పుణె (Pune)లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పుణె మున్సిపల్ కార్పొరేషన్ (PMC)కు చెందిన ట్రక్కు (Truck) ఉన్నట్టుండి భూమిలోకి కూరుకుపోయింది. అంత పెద్ద ట్రక్కు హఠాత్తుగా తల్లకిందులుగా భూమిలో పడిపోయింది. డ్రైవర్ వేగంగా స్పందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ)కు చెందిన డ్రైనేజ్ ట్యాంక్ క్లీనింగ్ వాహనం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో సమాధాన్ చౌక్‌లోని సిటీ పోస్ట్ ఆవరణలో నిలిచి ఉంది. అక్కడ క్లీన్ చేసిన అనంతరం డ్రైవర్ ఆ ట్రక్కును ముందుకు పోనిచ్చాడు. ఆ ట్యాంకర్ కాస్త ముందుకు కదలగానే అక్కడ భూమి కుంగిపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది. ముందు ఆ ట్రక్కు వెనుక భాగం ఆ గోతిలో పడిపోయింది. తర్వాత ట్రక్కు మొత్తం ఆ గోతిలోకి జారిపోయింది. వెంటనే స్పందించిన డ్రైవర్ వాహనం నుంచి బయటకు దూకి సురక్షితంగా బయటపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ట్రక్కును తాళ్ల సహాయంతో బయటకు లాగేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 21 , 2024 | 07:38 AM