కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: చెట్టు పైన కొండచిలువ.. నేల పైన పందికొక్కు.. శతవిధాలా ప్రయత్నించినా చివరకు ఏమైందో చూడండి..

ABN, Publish Date - Jan 10 , 2024 | 04:20 PM

పాములు, కొండచిలువలు ఒక్కసారి వేటను టార్గెట్ చేశాయంటే.. ఎలాగైనా వాటి సొంతం కావాల్సిందే. అయితే వాటికీ కొన్నిసార్లు ఊహించని అనుభవం ఎదురవుతుంటుంది. కొన్నిసార్లు...

Viral Video: చెట్టు పైన కొండచిలువ.. నేల పైన పందికొక్కు.. శతవిధాలా ప్రయత్నించినా చివరకు ఏమైందో చూడండి..

పాములు, కొండచిలువలు ఒక్కసారి వేటను టార్గెట్ చేశాయంటే.. ఎలాగైనా వాటి సొంతం కావాల్సిందే. అయితే వాటికీ కొన్నిసార్లు ఊహించని అనుభవం ఎదురవుతుంటుంది. కొన్నిసార్లు నోటిదాకా వచ్చిన ఆహారం కాస్తా చేజారిపోతుంటుంది. మరికొన్నిసార్లు ఎన్నిసార్లు ప్రయత్నించినా నిరాశే ఎదురవుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చెట్టుపై ఉన్న కొండచిలువ నేలపై ఉన్న వేటను టార్గెట్ చేసింది. చివరకు ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చెట్టుపై ఉన్న కొండచిలువ (python) ఆహారం కోసం వేచి చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో దానికి నేలపై ఓ పందికొక్కు కనిపిస్తుంది. దీంతో వెంటనే దానిపై దాడి చేసి చంపేస్తుంది. తర్వాత దాన్ని చెట్టుపైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. చెట్టు పైకి సగం ఎక్కిన తర్వాత పందికొక్కును పైకి తీసుకెళ్లడం కష్టమవుతుంది. పందికొక్కును నోటితో పట్టుకోవడం ఇబ్బందిగా అవడంతో దాదాపు నేలపై పడిపోయే పరిస్థితి వస్తుంది.

Viral Video: వేడి నీరు పట్టుకొచ్చిన యువతి.. తమాషా చేస్తుందనుకుంటే.. చివరకు అందరికీ పెద్ద షాకే ఇచ్చింది..

కానీ కొండచిలువ మాత్రం ఎలాగైనా దాన్ని చెట్టు పైకి తీసుకెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా పైకి లాగడం చాలా కష్టమైపోతుంది. ఇలా చాలా సేపు కొండచిలువ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. చెట్టుకు సమీపంలోని వారు ఈ ఘటనను చూసి అవాక్కవుతారు. వెంటనే వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కొండచిలువకు ఎనర్జీ తగ్గినట్లుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇంతకీ చివరకు ఏం జరిగింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వాకింగ్‌కు తీసుకెళ్లాలంటూ తొందరపెట్టిన కుక్కలు.. చివరకు యజమాని పరిస్థితి చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Jan 10 , 2024 | 04:20 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising