Rain Insects: వర్షం పురుగులు ఇంట్లోకి వస్తున్నాయా? ఈ టిప్స్ తో తరిమికొట్టండి..!
ABN, Publish Date - Jul 01 , 2024 | 03:57 PM
ప్రతి సీజన్ లో ఏదో ఒక సమస్య ఉన్నట్టే వర్షాకాలంలోనూ దోమలు, ఈగలు, పురుగుల సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా వర్షం వచ్చిన రోజు లేదా మరుసటి రోజు సాయంత్రం సమయంలో లైట్ వెలుతురుకు లెక్కలేనన్ని పురుగులు ఇళ్లలోకి వస్తుంటాయి.
ప్రతి సీజన్ లో ఏదో ఒక సమస్య ఉన్నట్టే వర్షాకాలంలోనూ దోమలు, ఈగలు, పురుగుల సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా వర్షం వచ్చిన రోజు లేదా మరుసటి రోజు సాయంత్రం సమయంలో లైట్ వెలుతురుకు లెక్కలేనన్ని పురుగులు ఇళ్లలోకి వస్తుంటాయి. వీటిలో కొన్ని కుడతాయి. మరికొన్ని ఇల్లంతా చెల్లాచెదురుగా పడి ఇంటిని అపరిశుభ్రంగా మారతాయి. కొన్నిసార్లు తినే ఆహారంలోనూ, తాగే పానీయాలలో కూడా పడుతుంటాయి. ఈ వర్షపు పురుగుల దాడి భరించలేక చాలామంది సాయంత్రం అయ్యిందంటే లైట్లు ఆఫ్ చేస్తుంటారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఈ వర్షపు పురుగులు పారిపోతాయి. అవేంటో తెలుసుకుంటే..
Mangolia Flower: సంపెంగ పువ్వులు ఇలా వాడితే ఎన్ని లాభాలో..!
అరోమా క్యాండిల్స్..
వర్షపు పురుగులను తరిమికొట్టడానికి అరోమా క్యాండిల్స్ చక్కని పరిష్కారం. వీటిని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఒక గిన్నెలో సాధారణ కొవ్వొత్తులు ఉంచి వాటిని కరిగించాలి. ఒక గాజు సీసాలో 4,5 లవంగాలు(లేదా లవంగం పొడి), ఒక చెంచా కాఫీ పొడి వేయాలి. ఇందులోకి కరిగించిన కొవ్వొత్తి ద్రావణం పోయాలి. దీంట్లో కొవ్వొత్తి వెలిగించడానికి అనువుగా ఒక దారం ఉంచాలి. ఇది చల్లారిన తరువాత పురుగులు వచ్చే గదిలో వెలిగించాలి. ఈ వాసనకు వర్షపు పురుగులు పారిపోతాయి.
బేకింగ్ సోడా..
వర్షపు పురుగులను తరిమికొట్టడానికి బేకింగ్ సోడా కూడా ఉపయోగించవచ్చు. సమాన పరిమాణంలో బేకింగ్ సోడా, పంచదార తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమం పక్కన నీటితో నిండిన పాత్ర లేదా మూత ఉంచాలి. ఈ మిశ్రమం వల్ల పురుగులు ఈ నీటి దగ్గరకు వచ్చి నీటిలో పడిపోతాయి.
Curry Leaves: రోజూ ఉదయాన్నే ఒక రెమ్మ పచ్చి కరివేపాకులు నమిలి తింటే జరిగేది ఇదే..!
వేప..
వేప నూనెను నీటిలో కలిపి స్ప్రే బాటిలో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పురుగులు వచ్చినప్పుడు వాటి మీద స్ప్రే చేయాలి. పురుగులు పారిపోతాయి. వేపాకులను నీటిలో ఉడికించి కూడా ఈ స్ప్రే తయారుచేసుకోవచ్చు.
శనగపిండి..
శనగపిండి , బోరిక్ పౌడర్ లను చక్కెర నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని పురుగులు వచ్చే ప్రదేశంలో ఉంచాలి. దీని వల్ల పురుగులు ఇంట్లోకి వచ్చినా ఈ మిశ్రమం కారణంగా అక్కడి నుండి పారిపోతాయి.
Life Lesson: జీవితం మెరుగ్గా ఉండాలంటే ఈ 7 విషయాలను వదిలేయడం మంచిది..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jul 01 , 2024 | 03:57 PM