ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raksha Bandhan: రాఖీ కట్టే ముందు ఇలా చేస్తే.. మీకంతా మంచే జరుగుతుంది..!

ABN, Publish Date - Aug 18 , 2024 | 04:37 PM

రక్షాబంధన్ అక్కా, చెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టే ఉత్సవమని అందరికీ తెలుసు.. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాఖీ పూర్ణిమ పేరిట ఈ పండగ నిర్వహించుకుంటారు. తమ సోదరుడికి అక్కా, చెల్లెల్లు రాఖీ కట్టి.. స్వీట్ తినిపిస్తే.. సోదరుడు తమ సోదరికి స్థోమత ఆధారంగా కానుకను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

Raksha Bandhan

రక్షాబంధన్ అక్కా, చెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టే ఉత్సవమని అందరికీ తెలుసు.. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాఖీ పూర్ణిమ పేరిట ఈ పండగ నిర్వహించుకుంటారు. తమ సోదరుడికి అక్కా, చెల్లెల్లు రాఖీ కట్టి.. స్వీట్ తినిపిస్తే.. సోదరుడు తమ సోదరికి స్థోమత ఆధారంగా కానుకను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. రక్షాబంధన్ రోజు రాఖీ కట్టేముందు చెప్పాల్సిన శ్లోకం ఒకటుంది.

‘‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః

తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల’

ఈ శ్లోకం చదవి రాఖీ కడితే అంతా మంచే జరుగుతుందనేది ఒక విశ్వాసం. రక్షాబంధన్ అసలు ఉద్దేశం ఒకటే. కుటుంబంలో సోదర, సోదరీమణుల మధ్య అనుబంధాన్ని ప్రతిఏటా గుర్తుచేసుకోవడం, వారి కష్ట, సుఖాల్లో భాగస్వామ్యం కావడం కోసం పూర్వం నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, ఆత్మీయత తగ్గుతున్న నేటి కాలంలో ఈ రక్షాబంధన్ ఉత్సవం కుటుంబాల మధ్య ప్రేమానురాగాలు, అక్కా, చెల్లెలు, అన్నదమ్ముల మధ్య ఆప్యాయతను పెంచడానికి ఉపయోగపడుతుంది. ఒకరికి ఒకరు జీవితాంతం తోడుగా ఉంటామనే సందేశం ఇవ్వడమే ఈ పండుగ లక్ష్యం.


అసలు ఉద్దేశం..

నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష.. మనమిద్దరం కలిసి మన దేశాన్ని రక్షించుకుందామనే సందేశంతో పూర్వం నుంచి రక్షాబంధన్‌ను నిర్వహిస్తూ వస్తున్నారు. ‌ప్రతి ఒక్కరూ తమ జీవన సమరంలో నిమగ్నమై సాగిపోతున్నపుడు ఆశయ విస్మరణ జరుగకుండా ధర్మ, సంస్కృతులకు ఆధారమైన విద్యను, విజ్ఞానాన్ని గుర్తుచేయడమే రక్షాబంధన్‌ ఉత్సవం ప్రధాన ఉద్దేశం. సంస్కృతి, సంప్రదాయాలకు నష్టం వాటిల్లినపుడు, మనందరం ఐక్యంగా దానికి రక్షకులమై నిలబడాలని గుర్తుచేస్తూ ధర్మరక్షణలోనే నా రక్షణ ఉందని గుర్తుచేసే పండుగ రక్షాబంధన్. ఎవరైనా ధార్మిక క్రతువు చేస్తున్నప్పుడు తమ చేతికి ఎర్రటి కంకణం కట్టుకోవడం హిందువులలో ఆచారంగా వస్తుంది. ఇది ఒకరకంగా దీక్షాధారణ. ఈ ఎర్రటి కంకణాన్ని ధరించడం వలన ఆ వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు అన్నిరకాల దుష్ప్ర భావాలు దరిచేరకుండా కాపాడుతుందని విశ్వసిస్తారు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు ఇలాంటి కంకణాలు ధరించడం తరచూ చూస్తున్నాం. ఈ కంకణ ధారణ ప్రాచీన కాలం నుంచీ ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. బలిచక్రవర్తికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తూ వామనుడు ఈ పవిత్ర కంకణాన్ని కట్టినట్లు ప్రతీతి. రక్షను ధరించిన వ్యక్తికి తన కర్తవ్యం పదే పదే గుర్తుకు వస్తుంది. అలా తన సోదరి పట్ల బాధ్యతను గుర్తుచేస్తూ ప్రతి ఏటా రక్షాబంధన్ పేరిట చేతికి కంకణాన్ని కట్టడమే రక్షబంధన్ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. కేవలం సోదరీ, సోదరమణులు మాత్రమే కాకుండా.. ఐక్యమత్యం కోసం ఒకరికి ఒకరు రక్షణగా, తోడుగా ఉంటామనే సంకల్పంతో కట్టేదే రాఖీగా పురణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని రక్షా బంధన్‌గా పిలుస్తారు. తన భర్తకు విజయం కలగాలని కోరుతూ శచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి ఇంద్రుని కుడిచేతి మణికట్టుకి కడుతుంది. ఈ రాఖీ కట్టిన తర్వాత ఆయన యుద్ధంలో విజయం సాధించినట్లు పురణాల ద్వారా తెలుస్తోంది.


ఐక్యమత్యం..

రక్షాబంధన్ అంటే ప్రేమతో తన సోదరుడికి బాధ్యతలను గుర్తుచేస్తూ.. అంతా కలిసికట్టుగా ముందుకుసాగుదామనే సంకల్పంతో ఓ దారం పోగు కట్టినా అది రాఖీతో సమానం. ప్రేమ, ఆప్యాయత, ఇద్దరి మధ్య బంధం ఎంత బలంగా ఉందనేదానికి రక్షా బంధన్ నిదర్శనంగా నిలుస్తుంది. వ్యక్తుల మధ్య అన్యోన్యభావం ఏర్పడినప్పుడు ఆ సమాజంలో ఐకమత్యం, సమష్టి భావన వెల్లి విరుస్తుంది. కానీ ప్రస్తుతం నేను, నీవు వేరు కాదు అనే భావన మరచి ఆ స్థానంలో నేను, నా సంపాదనే ముఖ్యమనే భావన మనుషుల్లో ఏర్పడుతోంది. అందరితో కలిసి నేను ఎందుకు ఉండాలనే ఆలోచన పెరిగి వ్యక్తివాదం ఎక్కువవుతోంది. ఇలాంటి సందర్భంగా అందరినీ కలుపుతూ.. ఐక్యమత్యాన్ని చాటే పండుగ రక్షాబంధన్.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telugu News Click Here

Updated Date - Aug 18 , 2024 | 04:43 PM

Advertising
Advertising
<