ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Relationship: పెళ్లి తరువాత గొడవలు ఉండకూడదంటే.. పెళ్లికి ముందే భాగస్వామిని 7 ప్రశ్నలు అడగాలి..!

ABN, Publish Date - Jul 18 , 2024 | 01:38 PM

పెళ్లి అనేది ఈ ప్రపంచంలో చాలా గొప్ప సాంప్రదాయం. ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒక్కటి చేసి, ఇద్దరిని కలిపి ఉంచేది వివాహ బంధం. అయితే ఈకాలంలో పెళ్లిళ్లు జరగడం కష్టంగా మారింది. కానీ భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, విడిపోవడం అనేవి చాలా సులువుగా జరిగిపోతున్నాయి.

Marriage

పెళ్లి అనేది ఈ ప్రపంచంలో చాలా గొప్ప సాంప్రదాయం. ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒక్కటి చేసి, ఇద్దరిని కలిపి ఉంచేది వివాహ బంధం. అయితే ఈకాలంలో పెళ్లిళ్లు జరగడం కష్టంగా మారింది. కానీ భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, విడిపోవడం అనేవి చాలా సులువుగా జరిగిపోతున్నాయి. అలాగని విడిపోవాలనే ఉద్దేశ్యంతో ఎవరూ పెళ్లిళ్లు చేసుకోరు. కానీ పెళ్లి తరువాత సాధారణంగానే కొన్ని గొడవలు వాటికవే వచ్చేస్తుంటాయి. పెళ్లి తరువాత భార్యాభర్తల మధ్య గొడవలు రాకూడదంటే 7 ప్రశ్నలను ముందే భాగస్వామికి వెయ్యాలని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..

పాదాలు, మడమల్లో ఈ లక్షణాలు ఉంటే చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..!


పనికి మార్కులు..

ఏ పనికి ఎన్ని మార్కులు వేస్తారనే విషయం అబ్బాయిల ఆలోచనను వ్యక్తం చేస్తుందట. ఆఫీసు పనికి, వంటింట్లో పనికి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి.. ఇలా ఏ పనికి ఎన్ని మార్కులు వేస్తావని అడగాలి. అతను వేసే మార్కులను బట్టి అతను పనికి ఎంత గౌరవం ఇస్తాడనే విషయం అర్థమవుతుంది.

బాధ్యత..

చాలామంది మగవాళ్లు ఇంటి పని, వంట పని, పిల్లలను చూసుకోవడం మొదలైనవి భార్య మాత్రమే చెయ్యాలనే మెంటాలిటీతో ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్థులు అయితే ఇలా పనుల విషయంలో కూడా సమానంగా ఉండాలి. పనులు పంచుకోవాలి. అదేవిధంగా ఇద్దరూ షార్ట్ టెంపర్ వ్యక్తులు అయితే వారి మధ్య గొడవలు తొందరగా వచ్చేస్తాయి. కాబట్టి వీటి గురించి ముందే అబ్బాయితో చర్చించాలి.

పిల్లలు..

పిల్లలకు సంబంధించి ప్రణాళిక గురించి ముందే ఆలోచించుకోవాలి. పెద్దవాళ్ల ఒత్తిడి మీద కాకుండా పిల్లలను భార్యాభర్తల ఆర్థిక స్థితి, వారికి కేటాయించగలిగే సమయం, వయసు మొదలైనవి దృష్టిలో ఉంచుకుని నిర్ణయించుకోవాలి. దీని గురించి పెళ్లికి ముందే అబ్బాయితో మాట్లాడాలి.

వర్షాకాలంలో ఈ కాంబినేషన్ ఫుడ్స్ అస్సలు తినకండి..!


కుటుంబం..

తల్లిదండ్రులతో కలసి జీవించాలని అనుకునేవారు కొందరు ఉంటారు. భార్యాభర్తలు మాత్రమే విడిగా ఉండాలని అనుకునే వారు కూడా ఉంటారు. పెళ్లికి ముందు దీని గురించి చర్చించకుండా పెళ్లి తర్వాత విడిగా ఉండాలనే ప్రతిపాదన తెస్తే అది భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుంది. ఈ విషయంలో పెళ్ళికి ముందే స్పష్టత ఉండటం ముఖ్యం.

పాత బంధాలు..

ఇప్పట్లో ప్రతి ఒక్కరికి గతం అనేది ఉంటోంది. గతం ఉన్నా పర్లేదు కానీ పాత రిలేషన్ లో ఉన్న వ్యక్తులతో ఇంకా టచ్ లో ఉండటం వారితో మాట్లాడటం మంచిది కాదు. ఇవి భార్యాభర్తల మధ్య బంధాన్ని దెబ్బతీస్తాయి. పెళ్లికి ముందే ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోవడం మంచిది.

రాత్రిపూట చేసే ఈ పొరపాట్ల వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి..!


సంపాదన..

సంపాదన గురించి భార్యాభర్తల మధ్య అబద్దాలకు ఆస్కారం ఉండకూడదు. ఏదైనా పెద్ద లోన్ లేదా అప్పు వంటివి ఉంటే నిజాయితీగా ముందే మాట్లాడుకోవాలి.

ఆరోగ్య సమస్యలు..

కాబోయే భార్యాభర్తల ఇద్దరిలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి గురించి ముందుగానే అడిగి తెలుసుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా వారసత్వ జబ్బులు ఉన్నాయా కనుక్కోవాలి. ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టైతే వాటి గురించి తప్పకుండా తెలియజేయాలి.

పాదాలు, మడమల్లో ఈ లక్షణాలు ఉంటే చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..!

ప్రపంచంలో అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగిన జంతువులు ఇవే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 18 , 2024 | 01:38 PM

Advertising
Advertising
<