Rivers Psychology: మీ భాగస్వామి మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా.. ఇలా చేశారంటే తోక ఊపుకుంటూ మీ వెంట పడతారు..!
ABN, Publish Date - Nov 11 , 2024 | 03:15 PM
రిలేషన్ లో ఉన్నప్పుడు కొందరు భాగస్వామిని నిర్లక్ష్యం చేయడం, చులకనగా చూడటం, ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, వ్యతిరేకించడం వంటివి చేస్తుంటారు. రివర్స్ సైకాలజీ ఫాలో అయితే వాళ్లే తోక ఊపుకుంటూ మీ వెంట వస్తారు.
మనిషి మానసిక ప్రవర్తనను వివరించే విభాగాన్ని సైకాలజీ అంటారు. ఈ సైకాలజీ ప్రకారం మనుషులను వివిధ వర్గాలుగా విభజిస్తారు. మానసిక సమస్యలు ఏవైనా ఇబ్బంది పెడుతుంటే సైకాలజిస్ట్ ల దగ్గరకు వెళితే సమస్యకు తగిన పరిష్కారం చెబుతుంటారు. నేటి కాలంలో బంధాలలో సైకాలజీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా స్నేహాలు, ప్రేమలు, వివాహ బంధాలు చాలా తొందరగా విరిగిపోతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఇవి ఎక్కువ. దీనికి కారణం బంధంలో వ్యతిరేకత ఎదురుకావడం. దీనికారణంగా వాదోపవాదాలు, గోడవలు ఏర్పడుతున్నాయి. బంధాలను తెంచుకోవడం వీటికి పరిష్కారం అనుకోకూడదు. మిమ్మల్ని వ్యతిరేకించినా, మీ గురించి పట్టించుకోకపోయినా, మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నా అలాంటి వారి పట్ల రివర్స్ సైకాలజీ ప్రయోగించాలని అంటున్నారు మానసిక విశ్లేషకులు. ఇవి ఫాలో అయితే మిమ్మల్ని కాదు అనుకునేవాళ్లు మీ వెంట తోక ఊపుకుంటూ వస్తారట. ఇంతకీ రివర్స్ సైకాలజీలో ఏం చేయాలంటే..
మాంసాహారాన్ని తలదన్నే గింజలు ఇవి.. వీటిలో ప్రోటీన్ ఎంతంటే..
అందుబాటులో ఉండకండి..
భాగస్వామి మీతో ఏదైనా చెప్పాలని , తనకు ఏదైనా అవసరం అయ్యే సందర్భాలు తప్పకుండా వస్తాయి. కాబట్టి వారు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని, వారి దృష్టిలో మీకు ప్రాముఖ్యత లేదని బాధపడకుండా వారికి అందుబాటులో ఉండకుండా చేయాలి. ఏదైనా ఇతర ముఖ్యమైన పని, కుటుంబానికి ముఖ్యమైన వ్యక్తుల కారణంగా బిజీగా ఉండిపోవాలి. లేదంటే ప్రొఫెషన్, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, కెరీర్ ను ముందుకు నడపడం వంటి వాటి వైపు దృష్టి పెట్టాలి. వారు మిమ్మల్ని నిలదీసినా తగిన కారణాలు చెప్పవచ్చు. ఫైనల్ గా వారి చుట్టూ మీరు లేకపోతే ఖచ్చితంగా వారే మీ మీద దృష్టి పెడతారు. వారి పనులు వదుకుని మరీ మీ దగ్గరకు వస్తారు.
ఆసక్తిగా ఉండకండి..
ఎక్కువ ఆసక్తి చూపించినా, ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా ఎవరైనా సరే విలువ కోల్పోతారు. భాగస్వామి విషయంలో కూడా ఇంతే.. ఎప్పుడూ అటెన్షన్ ఇస్తూ వారి విషయంలో ఆసక్తిగా, ఉత్సాహంగా ఉంటే అవతలి వారు నిర్లక్ష్యంగా మారే అవకాశం ఉంటుంది. ఇదే వ్యతిరేకత, గొడవలు, వివాదాల వైపు వెళుతుంది. అందుకే ఎప్పుడూ భాగస్వామి మీద చాలా ఆసక్తిగా ఉన్నట్టు బయటపడకూడదు.
Health Tips: వంటల్లో పచ్చ కర్పూరం ఎందుకు జోడిస్తారు? ఇది ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదంటే..
మార్పు ఉండాలి..
ఎప్పుడూ ఒకేలాగా ఉండకూడదు. ఆలోచనల నుండి ప్రవర్తన వరకు మారుతూ ఉండాలి. మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్న భాగస్వామి దగ్గర కొన్నిసార్లు మీరు కూడా నో చెప్పగలగాలి. కొన్ని విషయాలకు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవాలి. వారిని కూడా అవాయిడ్ చేస్తున్నాం అనే విషయం వారిని భరించనీయదు. వారు తమ ప్రవర్తన మార్చుకునేలా చేస్తుంది.
ఫోకస్..
భాగస్వామి గురించి ఆలోచించడం, వారి మీదనే దృష్టి పెట్టడం చేస్తుంటే వారు నేనే సుప్రీమ్ అన్నట్టు ఫీల్ అవుతారు. దీన్నుండే ఇగో, అహంకారం పుడతాయి. అలా కాకుండా మీ మీద మీరు దృష్టి పెట్టి మీ గురించి మీరు కేర్ తీసుకుంటూ మీలో మీరు సంతోషంగా ఉంటే అప్పుడు భాగస్వామికి అర్థం అవుతుంది. భాగస్వామి లేకపోయినా సరే సంతోషంగా ఉంటామనే విషయం అర్థం అయితే వారే మీ వెంట పడతారు.
మరచిపోవద్దు..
దగ్గరగా ఉన్న వస్తువుకు అయినా సరే విలువ ఇచ్చే వారు తక్కువ. ముఖ్యంగా రిలేషన్షిప్ లో భాగస్వామి విషయంలో చాలామంది ఇలాగే ఉంటారు. అందుకే వారికి అందుబాటులో ఉండకుండా వీలైనంత వరకు దూరంగానే ఉండటానికి, మీ పనులు మీరు చేసుకుంటూ సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం ప్రయత్నించండి. ఇలా చేస్తుంటే వాళ్లే మీ కాళ్ల దగ్గరకు వస్తారు.
ఇవి కూడా చదవండి..
Rainbow Diet: రెయిన్ బో డైట్ అంటే ఏంటి? దీన్ని ఫాలో అయితే కలిగే లాభాలేంటంటే..!
Food Hacks: స్టఫ్డ్ పరోటాలు రుచిగా ఫర్పెక్ట్ గా రావాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Nov 11 , 2024 | 03:15 PM