ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రియల్ డాగ్స్, రోబో డాగ్ ఫేస్ టు ఫేస్.. ఆ కుక్కల రియాక్షన్స్ చూస్తే నవ్వాపుకోలేరు..

ABN, Publish Date - Oct 04 , 2024 | 04:22 PM

ప్రస్తుతం రోబోటిక్ జంతువులకు విపరీతంగా క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా రోబోటిక్ కుక్కలను పెంచుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఏఐ టెక్నాలజీతో పని చేసే ఈ రోబో డాగ్స్ నిజమైన కుక్కలలాగానే ప్రవర్తిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే.

Robot dog comes face to face with real dogs

ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), రోబోటిక్స్ (Robotics) ప్రపంచంలో కలలో కూడా ఊహించని ఘటనలు కళ్ల ముందుకు వస్తున్నాయి. మనుషుల రూపంలో ఉండే రోబోలు కాదు.. రోబోటిక్ జంతువులకు (Robotic animals) విపరీతంగా క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా రోబోటిక్ కుక్కలను (Robotic Dogs) పెంచుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఏఐ టెక్నాలజీతో పని చేసే ఈ రోబో డాగ్స్ నిజమైన కుక్కలలాగానే ప్రవర్తిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. ఓ రోబోటిక్ డాగ్ పార్క్‌లో వాకింగ్‌కు వచ్చి సాధారణ కుక్కలాగానే నడకను ఆస్వాదిస్తున్న వీడియో అది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


@gogogos అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఓ రోబో డాగ్ పార్క్‌లో నడుచుకుంటూ వెళ్తోంది. నిజమైన కుక్కలు ఆ రోబో డాగ్‌ను చూసి ఆశ్చర్యపోయాయి. ఓ కుక్క దగ్గరకు వచ్చి దానిని చూసి భయంతో పారిపోయింది. నిజమైన కుక్కలతో స్నేహం చేసేందుకు ఆ రోబో డాగ్ ప్రయత్నించింది. అయితే ఆ వింత జంతువును చూసి కుక్కలు పారిపోయాయి. ఆ రోబో డాగ్ చేయి ఎత్తి పిలుస్తున్నా పట్టించుకోకుండా దూరం జరిగిపోతున్నాయి. మొత్తానికి రియల్ డాగ్స్‌ను ఆ రోబో డాగ్ పరుగులు పెట్టించింది. ఆ మెకానికల్ డాగ్ తో స్నేహం చేసేందుకు రియల్ కుక్కలు ఆసక్తి చూపించలేదు.


ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 18 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 12 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఈ వీడియో చూస్తే ఏలియన్స్ భూమిపైకి వచ్చినట్లు అనిపిస్తోంది``, ``ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కుక్కలకు కూడా ప్రమాదం వచ్చిపడింది``, ``రోబో కుక్క ఇలా నిజమైన కుక్కలతో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నించడం చాలా బాగుంది``, ``ఆ కుక్కల భయం అర్థం చేసుకోవాల్సిందే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పీహెచ్‌డీ చేస్తూ చికెన్ పకోడీ వ్యాపారం.. వైరల్ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందన ఏంటంటే..

Viral Video: ప్రేయసితో కలిసి స్కూటీపై వెళ్తున్న భర్త.. అతడి భార్య ఎలాంటి షాకిచ్చిందంటే.. వీడియో వైరల్..


Viral Video: పాకిస్తాన్ పరిస్థితి మరీ ఘోరం.. పెద్ద గుంత నుంచి మనుషులు బయటకు ఎలా వస్తున్నారో చూడండి..


IQ Test: మీ తెలివికి సవాల్.. ఈ ఫుట్‌బాల్ గేమ్‌లోని తప్పును 10 సెకెన్లలో కనుక్కోండి..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 04 , 2024 | 04:22 PM