ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fact Check : ఒక్కడే కొడుకు ఉన్నోళ్లు సంక్రాంతి రోజున కచ్చితంగా ఈ పని చేయాలా..?

ABN, Publish Date - Jan 09 , 2024 | 03:44 PM

నిజం నోరు దాటే లోపు.. అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది అన్నది ఒకప్పటి మాట.. కానీ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఊరు దాటడంతో పాటూ క్షణాల్లో ప్రపంచాన్నే చుట్టేస్తోంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..

నిజం నోరు దాటే లోపు.. అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది అన్నది ఒకప్పటి మాట.. కానీ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఊరు దాటడంతో పాటూ క్షణాల్లో ప్రపంచాన్నే చుట్టేస్తోంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సంక్రాతి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ఓ వింత ప్రచారంపై మహిళలు భయాందోళనలు చెందుతున్నారు. ‘‘మీకు ఒక్కడే కొడుకు ఉన్నాడా.. అయితే ఈ సంక్రాంతి లోపు వెంటనే ఈ పని చేయండి.. లేదంటే పెద్ద కీడు జరుగుతుంది’’.. అనే ప్రచారం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇచే చర్చ జరుగుతోంది. అసలు ఈ ప్రచారం ఏంటీ.. ఈ పని చేయకపోతే నిజంగానే నష్టం జరుగుతుందా.. అనే విషయాలు తెలుసుకుందాం పదండి..

సంక్రాంతి పండుగ (Sankranti festival) వేళ సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఓ వార్త మహిళలను ఆందోళనకు గురి చేస్తోంది. ‘‘ఈ సంక్రాంతికి ఓ కీడు వచ్చింది.. ఒక్క కొడుకు ఉన్న మహిళలంతా.. ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న మహిళలతో డబ్బులు తీసుకుని, దాంతో ఐదు రకాల గాజులు (bangles) కొని ధరించాలి. ఇలా చేయని వారి ఇంట్లో పెద్ద కీడు జరగబోతోంది’’.. ఇది ఈ ప్రచార (roomer) సారాంశం. ఈ వార్త కాస్త ఆ నోటా.. ఈ నోటా పడి నెట్టింట్లోకి వచ్చి చేరింది. ఇంకేముందీ క్షణాల్లో రెండు తెలుగు రాష్ట్రాలను చుట్టేసింది. ప్రస్తుతం ఎక్కడ ఇద్దరు మహిళలు కలిసినా.. వారి మధ్య ప్రధానంగా ఇదే చర్చ నడుస్తోంది. మరోవైపు ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తమ ఇంట్లో ప్రమాదం జరుగుతుందో అనే భయంతో పరుగుపరుగున వెళ్లి.. తమ బంధువులు, స్నేహితులు, సన్నిహితుల వద్ద డబ్బులు తీసుకుని, గాజులు కొంటున్నారు.

Viral Video: ఇంత అందంగా ఉన్న ఈ యువతి.. అంతలోనే ఎలా భయపెట్టిందో చూడండి..

గాజులు వేసుకున్న మహిళలు అంతటితో ఆగకుండా ఫొటోలు తీసుకుని.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సమీస్తుండడంతో ఈ వార్త ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. మూఢనమ్మకాలు నమ్మని మహిళలు కూడా.. ‘‘గాజులే కదా.. పోయేదేముందీ.. కొంటే పోలా’’.. అని అనుకుంటూ ముందు జాగ్రత్త చర్యగా.. గాజుల దుకాణాలకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలు మొదలుకొని, నగరాల వరకూ ఎక్కడ చూసినా గాజుల దుకాణాల వద్ద మహిళల రద్దీ కనిపిస్తోంది. అయితే దీనిపై కొందరు వేద పండితులు మాట్లాడుతూ.. ఇదంతా ఎవరో కావాలని చేసిన ప్రచారం అని కొట్టి పారేస్తున్నారు. అలా చేయాలని జ్యోతిష్యంలో ఎక్కడా లేదని చెబుతున్నారు. ఇలాంటి భయాందోళనలు ఏవీ పెట్టుకోవద్దని భరోసా ఇస్తున్నారు. అయితే కొందరు వ్యాపారులు తమ స్వలాభం కోసమే ఇలా పుకార్లు పుట్టించారని తెలుస్తోంది. గతంలోనూ సంక్రాంతి, ఉగాది తదితర పండుగల సమయంలో చీరలు పంచాలి, కుంకుమ భరిణలు ఇవ్వాలి అంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ సంక్రాంతి కీడు వార్త మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: కొండచిలువ కడుపులో గుండ్రటి ఆకారం.. ఏమై ఉంటుందని బలవంతంగా బయటికి తీయగా..

Updated Date - Jan 09 , 2024 | 04:38 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising