Viral Video: ఈ వీడియోలో రెండు మృగాలున్నాయి.. హిప్పో నోట్లో ఓ పర్యాటకుడు ఏం వేశాడో చూస్తే కోపం రాకుండా ఉండదు..!
ABN, Publish Date - Jul 10 , 2024 | 02:38 PM
ఈ భూగ్రహం మీద అనేక జీవులలో మానవులు అత్యంత స్వార్థపరులు. ఈ భూమి మొత్తం తమ సంతోషం, సౌకర్యాల కోసం ఉన్నదని భావిస్తూ వినాశనానికి తెగబడుతుంటారు. ఇతర జీవుల గురించి ఆలోచించకుండా ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. తమ అవసరాల కోసం అమాయక జీవులను బాధపెట్టి చంపేస్తుంటారు.
ఈ భూగ్రహం (Earth) మీద అనేక జీవులలో మానవులు అత్యంత స్వార్థపరులు. ఈ భూమి మొత్తం తమ సంతోషం, సౌకర్యాల కోసం ఉన్నదని భావిస్తూ వినాశనానికి తెగబడుతుంటారు. ఇతర జీవుల గురించి ఆలోచించకుండా ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. తమ అవసరాల కోసం అమాయక జీవులను బాధపెట్టి చంపేస్తుంటారు. ఇటీవలి కాలంలో వినోదం కోసం చాలా మంది అడవుల్లో సఫారీ టూర్లకు (Safari Tour) వెళుతున్నారు. వన్య ప్రాణులను (Wild Animals) చూసి థ్రిల్ పొందుతున్నారు. ఆ క్రమంలో వారు ప్రకృతికి, మూగ జీవాలకు హాని కలిగిస్తున్నారు (Viral Video).
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ప్రకృతి ప్రేమికులకు, మూగ జీవాల పట్ల ప్రేమ ఉన్న వారికి తీవ్ర ఆగ్రహం కలుగుతుంది. పశ్చిమ జావాలోని బోగోర్‌లోని సఫారీ పార్క్‌లో ఈ సంఘటన జరిగింది. @PicturesFoIder అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ హిప్పో (Hippo) నీటి ఒడ్డుకు వచ్చి పర్యాటకులు ఇచ్చే ఆహారం కోసం నోరు జాపింది. ఓ వ్యక్తి దాని నోట్లు క్యారెట్ వేస్తున్నాడు. అంతలో పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఆ హిప్పో నోట్లోకి ఓ పాలిథిన్ కవర్ వేశాడు. పాపం.. ఆ హిప్పో ఆ కవర్‌ను తినేసింది (Plastic Bag In Hippo’s Mouth).
ఈ ఘటన మొత్తాన్ని మరో పర్యాటకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 20 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ``ఈ కవర్ హిప్పోను చంపగలదు``, ``ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి``, ``అతడు మృగం కంటే దారుణమైనవాడు``, ``ఇది అత్యంత దారుణం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. కాగా, ఆ నిందితుడి కోసం గాలిస్తున్నట్టు సఫారీ పార్క్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 10 , 2024 | 02:38 PM