Viral Video: కాళ్లు లేకపోతేనేం.. ఈమె ధైర్యం, పట్టుదల ముందు ఎవరు సరిపోతారు.. ఆమె డ్యాన్స్ చూడండి..
ABN, Publish Date - Sep 08 , 2024 | 05:15 PM
అంకిత భావం, పట్టుదల ఉంటే మనం అనుకున్నది సాధించవచ్చు. ప్రతిభను అడ్డుకునే హద్దులు లేవు. శారీరకంగా లోపం ఉన్నా సరే దానిని అధిగమించే ధైర్యం ఉంటే ఎవరైనా దాసోహం కావాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ అమ్మాయి వీడియో ఇందుకు ఉదాహరణ.
అంకిత భావం, పట్టుదల ఉంటే మనం అనుకున్నది సాధించవచ్చు. ప్రతిభను (Talent) అడ్డుకునే హద్దులు లేవు. శారీరకంగా లోపం (Disable) ఉన్నా సరే దానిని అధిగమించే ధైర్యం ఉంటే ఎవరైనా దాసోహం కావాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ అమ్మాయి వీడియో ఇందుకు ఉదాహరణ. ఆ అమ్మాయి వికలాంగురాలు (Disabled girl). కానీ ఆ అతి పెద్ద లోపం ఆమె అభిరుచిని నెరవేర్చుకోకుండా ఆపలేకపోయింది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆమె డ్యాన్స్ (Dance) చేయడాన్ని ఎవరైనా చూస్తే అభినందించకుండా ఉండలేరు (Viral Video).
@VikashMohta అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. నలుపు రంగు కుర్తా పైజామా ధరించిన ఆ అమ్మాయి ఫుల్ ఎనర్జీతో నవ్వుతూ డ్యాన్స్ చేస్తోంది. హిందీ పాట ``తినాక్ టిన్ తానా, కోయి ధున్ తో బజ్నా``కు ఆమె చక్కగా డ్యాన్స్ చేసింది. కాళ్లు లేకపోయినా ఆ లోపమే తెలియనీయకుండా ఆ అమ్మాయి స్టెప్స్, పాటకు తగినట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. ఆమె వీడియో చూసిన నెటిజన్లు ఆమెకు సెల్యూట్ చేయకుండా ఉండలేకపోతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వైరల్ వీడియోకు వేలల్లో లైక్స్, వ్యూస్ వచ్చాయి. ఆ అమ్మాయి డ్యాన్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ``ఆ అమ్మాయి ధైర్యం, అంకితభావానికి సెల్యూట్``, ``ఇది చాలా అందమైన ప్రదర్శన``, ``ఆమెకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఆహా.. ఈ కుర్రాడి ట్యాలెంట్‌కు అవాక్కవ్వాల్సిందే.. అమ్మాయిలా ఎలా డ్యాన్స్ చేశాడో చూడండి..
Picture Puzzle: మీ కళ్లకు స్పెషల్ టెస్ట్.. ఈ రెండు ఫొటోలోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనుక్కోండి...
Viral Video: వామ్మో.. ఇదెక్కడి మంచం రా నాయనా.. వంద మంది ఒకేసారి కూర్చున్నా సరిపోతుందేమో..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 08 , 2024 | 05:16 PM