Viral Video: ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ట్రాక్టర్ టైర్లను బైక్‌తో ఎలా తీసుకెళ్తున్నాడో చూడండి..
ABN, Publish Date - Oct 14 , 2024 | 10:18 AM
మన దేశంలో చాలా మంది తమ తెలివితేటలు ఉపయోగించి క్లిష్టమైన సమస్యలకు కూడా సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. ఏదో ట్రిక్ ఉపయోగించి చాలా సులభంగా పని పూర్తి చేస్తుంటారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
మన దేశంలో సాధారణ వ్యక్తులు కూడా అమోఘమైన తెలివితేటలు ప్రదర్శిస్తారు. సాధారణ మెకానిక్‌లు కూడా ఇంజనీర్ల తరహాలో తమ పనితనాన్ని చూపిస్తుంటారు. తమ తెలివితేటలు ఉపయోగించి క్లిష్టమైన సమస్యలకు కూడా సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. ఏదో ట్రిక్ (Trick) ఉపయోగించి చాలా సులభంగా పని పూర్తి చేస్తుంటారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి తెలివితేటలపై (Intelligence) ప్రశంసలు కురిపిస్తున్నారు (Viral Video).
keerat_t1diabetes అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ సర్దార్జీ బైక్ (Bike) మీద పొలానికి వెళుతున్నాడు. ట్రాక్టర్ చక్రాలను అమర్చిన ఓ ఇనుప ఫ్రేమ్‌ను తన బైక్‌కు తగిలించాడు. ఆ ఇనుప ఫ్రేమ్‌పై ఓ వ్యక్తిని కూర్చోబెట్టాడు. అంత పెద్ద ఇనుప ఫ్రేమ్‌ను, ట్రాక్టర్ చక్రాలను తన బైక్‌కు కట్టేసి సులభంగా, వేగంగా లాక్కెళ్లిపోతున్నాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ``ఇది పంజాబ్‌లో మాత్రమే జరుగుతుంది`` అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. దాదాపు 5 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇలాంటి వ్యక్తుల కోసం ఓ ప్రత్యేక అవార్డు ఇవ్వాలి``, ``మంచి ఆలోచన``, ``మెదడు వాడితే శ్రమ తగ్గుతుంది``, ``చాలా వినూత్నమైన ఆలోచన`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలు.. కాళ్లు లేకపోయినా ధైర్యంగా ముందుకెళ్లొచ్చు.. వీడియో వైరల్..
Viral Video: కారులో అత్తారింటికి వధూవరులు.. కారులో వరుడు చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Viral Video: పెళ్లి మండపం నుంచి పారిపోతున్నాడా? రోడ్లపై ఆ వరుడు ఎందుకలా తిరుగుతున్నాడంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 14 , 2024 | 10:18 AM