ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: క్లాస్‌లోనే గుర్రు పెట్టి నిద్రపోయిన మహిళా టీచర్.. బాలిక ఏం చేస్తోందో చూస్తే కోపం రాక మానదు!

ABN, Publish Date - Jul 28 , 2024 | 02:01 PM

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్తును చక్కదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. అందుకే తల్లి, తండ్రి తర్వాత గురువునే పూజించాలని పెద్దలు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.

School Teacher Caught Sleeping Inside Class

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్తును చక్కదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై (Teacher) ఉంటుంది. అందుకే తల్లి, తండ్రి తర్వాత గురువునే పూజించాలని పెద్దలు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కొందరు టీచర్లు తమ ఇష్టారీతిన ప్రవర్తిస్తూ ఉపాధ్యాయ వృత్తికి కళంకం తీసుకొస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో టీచర్‌ నిర్వాకం బయటపడింది. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఓ పంతులమ్మ క్లాస్‌ రూమ్‌లోనే హాయిగా గుర్రుపెట్టి నిద్రపోతోంది (Viral Video).


ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని అలీగఢ్‌లోని గోకుల్‌పురా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో (School) ఈ ఘటన జరిగింది. స్కూల్‌ టైమ్‌లో క్లాసులు చెప్పాలసిన టీచర్‌ హాయిగా నిద్రపోతోంది (Sleeping). పిల్లలు ఆమె చుట్టూ కూర్చుని బుక్స్‌, అట్టలతో గాలి విసురుతున్నారు. ఆమె నిర్వాకాన్ని స్థానికులు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణకు ఆదేశించామని, ఉపాధ్యాయురాలిపై తగిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు.


ఈ వీడియోపై నెట్టింట తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇప్పటివరకు 2 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను చూసి విమర్శలు చేశారు. ``యూపీలో విద్యా వ్యవస్థ ఇలాగే ఉంటుంది``, ``ఇలాంటి టీచర్లు ఉన్న పిల్లలు ఎలా పైకి వస్తారు``, ``ఆ టీచర్‌పై చర్యలు తీసుకోవాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇలా కూడా బస్సు నడుపుతారా? డ్రైవర్‌కు కండక్టర్ చేస్తున్న సహాయం చూస్తే షాకవ్వాల్సిందే..!


Optical Illusion: మీ కళ్ల పవర్ ఏంటో తెలుసుకోండి.. వీళ్లలో నిద్రపోతున్న పాపను గుర్తించండి..!

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Jul 28 , 2024 | 02:01 PM

Advertising
Advertising
<