Rare Bird: ఆ రెండు లక్షణాలూ ఉన్న అత్యంత అరుదైన పక్షి.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..
ABN, Publish Date - Jan 03 , 2024 | 02:34 PM
ఎన్నో వింతలు, విశేషాలు.. మరెన్నో అద్భుతాలు కలగలిసిన ఈ సృష్టిలో.. అప్పుడప్పుడూ కొన్ని బయటపడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అరుదైన వ్యక్తులు, జంతువులు, వస్తువులు వెలుగులోకి రావడం చూస్తూ ఉంటాం. తాజాగా...
ఎన్నో వింతలు, విశేషాలు.. మరెన్నో అద్భుతాలు కలగలిసిన ఈ సృష్టిలో.. అప్పుడప్పుడూ కొన్ని బయటపడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అరుదైన వ్యక్తులు, జంతువులు, వస్తువులు వెలుగులోకి రావడం చూస్తూ ఉంటాం. తాజాగా, అత్యంత అరుదైన పక్షి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సగం ఆకుపచ్చ, సగం నీలం రంగుతో ఉండడంతో పాటూ ఆడ, మగ లక్షణాలు రెండూ ఉన్న ఈ పక్షి.. శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వందేళ్లలో కనిపించిన రెండో అరుదైన పక్షిగా ఇది రికార్డుల్లో్కి ఎక్కింది. వివరాల్లోకి వెళితే..
యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో (University of Otago) జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్.. ఈ పక్షిని (Rare Bird) కొలంబియాలో కనుగొన్నారు. సగం ఆకుపచ్చ, సగం నీరం రంగులో ఉన్న ఈ పక్షి.. ఆకుపచ్చ వైపు ఆడ పక్షి, నీలం రంగు వైపు మగ పక్షి లక్షణాలతో పాటూ అవయవాలనూ సంతరించుకుంది. దీన్ని శాస్త్రీయంగా ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫిక్ పక్షి అని పిలుస్తారు. ఈ పక్షిలో ఆడ, మగ కణాలుగా విభజింపపడ్డాయని హమీష్ స్పెన్సర్ చెబుతున్నారు. సెలవు సందర్భంగా తన స్నేహితుడు జాన్ మురిల్లో అనే శాస్త్రవేత్తతో కలిసి కొలంబియా అడవిలో పర్యటిస్తున్న సందర్భంలో ఈ పక్షిని గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి పక్షిని న్యూజిలాండ్‌లో తాను ఇంతవరకూ చూడలదేని పేర్కొన్నారు.
ఈ పక్షిలో ఆడ, మగ లక్షణాలతో పాటూ ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా ఉంటాయని ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ తెలిపారు. ఆడ పక్షి అండం విడుదల చేసే సమయంలో జరిగే కణ విభజనలో తలెత్తిన లోపాలతో పాటూ ఒకే అండం రెండు కణాలతో ద్విఫలదీకరణ చెందడం వల్ల ఇలాంటి జీవులు ఉత్పన్నమవుతాయని చెప్పారు. వందేళ్లలో కనిపించిన అనేక పక్షి జాతుల్లో ఇలాంటి గైనండ్రోమోర్ఫిజం లక్షణాలు ఉన్న వాటిలో ఇది రెండోదన్నారు. కొన్ని రకాల సాలీళ్లు, పక్షులలోనూ ఇలాండి లక్షణాలు కనిపిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ పక్షికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Updated Date - Jan 03 , 2024 | 02:34 PM