Viral Video: ఎవరూ లేకుండానే నడుస్తున్న స్కూటీ.. అలా ఎలా నడుస్తోందంటే.. వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే..
ABN, Publish Date - Dec 02 , 2024 | 01:55 PM
ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ఏదో ఒక కొత్త టెక్నాలజీ బయటపడుతోంది. వాహనాలు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం డ్రైవర్ లేకుండా నడిచే కార్ల గురించి మనం వింటూనే ఉన్నాం. సెల్ఫ్ డ్రైవింగ్‌తో పార్కింగ్ చేసుకునే కార్ల గురించి వింటూనే ఉన్నాం.
ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఆవిష్కరణ (Innovation) జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ఏదో ఒక కొత్త టెక్నాలజీ (Technology) బయటపడుతోంది. వాహనాలు (Vehicles) ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం డ్రైవర్ లేకుండా నడిచే కార్ల గురించి మనం వింటూనే ఉన్నాం. సెల్ఫ్ డ్రైవింగ్‌తో పార్కింగ్ చేసుకునే కార్ల గురించి వింటూనే ఉన్నాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ స్కూటీ (Scooty) ఎవరూ లేకుండా చక్కగా వెళ్లిపోతోంది (Driver less Scooty). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
డ్రైవర్ లేకుండా స్వయంగా నడుస్తున్న ఆ స్కూటీ వీడియోను చైనాలో చిత్రీకరించినట్టు చాలా మంది నమ్ముతున్నారు. @mikechinavlog అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ స్కూటీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఓ షోరూమ్ ముందు ఉన్న పార్కింగ్ ఏరియాకు వెళ్లింది. వెనక్కి, ముందుకు వెళ్తూ పార్కింగ్ ఏరియాలో సరిగ్గా పార్క్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఆ స్కూటీని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ వీడియోను చైనాలో చిత్రీకరించినట్టు అయితే దానిని నేను నమ్ముతున్నా``, ``అది రోబో బైక్``, ``అద్భుమైన టెక్నాలజీ``, ``అది స్టాండ్ ఎలా వేసుకుంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ కుక్కకు ఏమైంది.. పెళ్లి మండపంలో వధువుకు చుక్కలు చూపించిన పెట్ డాగ్..
Viral News: వావ్.. వంట మనిషి కోసం రెజ్యూమ్.. వెల్లువలా వస్తున్న జాబ్ ఆఫర్లు..
Viral Video: ఉక్కు శరీరం అంటే ఇదేనేమో.. అతడి దెబ్బకు స్టీల్ రాడ్ ఎలా వంగిపోయిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 02 , 2024 | 01:55 PM