ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shocking: ఇదెక్కడి విచిత్రం.. పక్షి కడుపులో నుంచి బయటపడుతున్న చేప.. అసలేం జరిగిందంటే..

ABN, Publish Date - Dec 28 , 2024 | 03:37 PM

బలహీనుడిని బలవంతుడు చంపుకుని కడుపు నింపుకోవడమే ఆటవిక ధర్మం. సముద్రంలో ఈదుతున్న చేపలను కొన్ని పక్షులు పట్టుకుని ఆకలి తీర్చుకుంటాయి. వేట కోసం కొన్ని జంతువులు, పక్షులు ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వేట వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

Eel and Heron Photo Viral

జంతు ప్రపంచంలో ఒక జీవి మరొక జీవికి ఆహారం కాక తప్పదు. బలహీనుడిని బలవంతుడు చంపుకుని కడుపు నింపుకోవడమే ఆటవిక ధర్మం. సముద్రంలో ఈదుతున్న చేపలను కొన్ని పక్షులు పట్టుకుని ఆకలి తీర్చుకుంటాయి. వేట కోసం కొన్ని జంతువులు, పక్షులు ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వేట వీడియోలు (Hunting Videos) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఒక జీవికి ఆహారం అయిపోయి పొట్టలోకి కూడా వెళ్లిపోయిన తర్వాత తిరిగి బయటపడడం అనేది సాధారణ విషయం కాదు. ప్రస్తుతం అలాంటి ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Photo).


@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ ఫొటోను ఓ వ్యక్తి చిత్రీకరించాడు. వైరల్ అవుతున్న ఆ ఫొటో ప్రకారం.. ఓ హెరాన్ పక్షి (Heron Bird) సముద్రంలోని ఈల్ చేపను (Eel Fish) పట్టుకుని మింగేసింది. ఆ పక్షి ఆకాశంలో వందల అడుగుల ఎత్తులోకి వెళ్లి ఎగురుతోంది. ఆ సమయంలో ఆ హెరాన్ పక్షి పొట్టను చీల్చుకుని ఈల్ చేప బయటపడుతోంది. సరిగ్గా అదే సమయంలో ఓ ఫొటోగ్రాఫర్ అరుదైన ఘటనను తన కమెరాలో బంధించాడు. ఆ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ ఫొటో చాలా మంది నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.


ఆ వైరల్ ఫొటోను ఇప్పటివరకు దాదాపు 3 కోట్ల మంది వీక్షించారు. 1.95 లక్షల కంటే ఎక్కువ మంది ఆ ఫొటోను లైక్ చేశారు. ఆ ఫొటోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``చేప ఆ పక్షి పొట్టను ఎలా కోసింది``, ``ఆ పక్షి చనిపోయిందా``, ``ఇది అసాధ్యం, ఇది కచ్చితంగా కెమేరా ట్రిక్ లేదా ఎడిటింగ్ కావచ్చు``, ``ఈ ఫొటోను వర్ణించడానికి నాకు పదాలు సరిపోవడం లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral News: బెడ్‌షీట్‌పై కాఫీ చుక్కలు.. కస్టమర్‌కు దిమ్మదిరిగే షాకిచ్చిన హోటల్ సిబ్బంది..


Optical Illusion Test: గుడ్ల గూబల మధ్యన పిల్లి.. మీ కళ్లు పవర్‌ఫుల్ అయితేనే 10 సెకెన్లలో పట్టుకోగలరు..


Viral News: ఉల్లిపాయ అడిగిన డెలివరీ బాయ్.. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే..


Viral Video: ఈ అమ్మాయికి ఏమైంది? బిజీ రోడ్డు మీద బైక్ అలా నడుపుతోందేంటి.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 28 , 2024 | 07:21 PM