ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఓ మై గాడ్.. బీచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ.. రాకాసి అలలు ఏం చేశాయో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం..

ABN, Publish Date - Nov 19 , 2024 | 08:54 AM

సముద్రపు అలలను తేలికగా తీసుకోకూడదు. అవి ఎప్పుడు విధ్వంసం సృష్టిస్తాయో ఊహించలేం. ఈ ప్రమాదాల గురించి తెలిసినప్పటికీ చాలా మంది అనవసర సాహసాలు చేసి ఇబ్బందుల్లో పడుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే.

Sea Waves Viral Video

సముద్రం ఒడ్డున (Sea Shore) ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలను తీసుకెళ్లినట్టైతే మరింత అప్రమత్తంగా ఉండాలి. సముద్రపు అలలను (Sea waves) తేలికగా తీసుకోకూడదు. అవి ఎప్పుడు విధ్వంసం సృష్టిస్తాయో ఊహించలేం. ఈ ప్రమాదాల గురించి తెలిసినప్పటికీ చాలా మంది అనవసర సాహసాలు చేసి ఇబ్బందుల్లో పడుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే. ఆ వీడియోలో రాకాసి అలలకు దొరికిన ఇద్దరు భయంకర అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


infoelovly అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ తన కుమార్తెతో కలిసి సముద్రం ఒడ్డున కూర్చుని ఉంది. అకస్మాత్తుగా ఒక అల వచ్చి వారిని లోపలికి లాగేసింది. మరొక అల వారిని ఒడ్డు వైపు నెట్టింది. మరో అల వారిని మళ్లీ లోపలికి లాగేసింది. సముద్రపు అలల మధ్య జీవన్మరణ పోరాటం చేస్తూ సహాయం కోసం తల్లీ కూతుళ్లు కేకలు వేశారు. ఒడ్డున ఉన్న వారు కూడా కేకలు వేశారు తప్ప వారిని కాపాడే సాహసం చేయలేకపోయారు. చాలా మంది ఆ ఘటనను వీడియో తీస్తూ ఉండిపోయారు. చివరకు ఇద్దరు వ్యక్తులు వారికి చేతులు అందించడంతో బతికి బయటపడ్డారు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.7 కోట్ల మందికి పైగా వీక్షించారు. 4.6 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``దేవుడే వాళ్లను కాపాడాడు``, ``వాళ్ల జన్మలో సముద్రం దగ్గరకు వెళ్లరు``, ```కొన్ని క్షణాల పాటు నా జీవితం స్తంభించిపోయింది``, ``అక్కడ ఎవరున్నా సహాయం చేయలేని పరిస్థితి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..


Optical Illusion Test: మీ కళ్లకు సవాల్.. ఈ అడవిలో కప్ప ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి..

Viral Video: మీరూ ఇలాంటి తప్పు చేయకండి.. ఆ కార్ డ్రైవర్ చేసిన పనికి ఏకంగా రూ.2.5 లక్షల జరిమానా..


Viral video: ఏం క్రియేటివిటీ బాసూ.. ట్రైన్ కింద నుంచి కార్లు, పై నుంచి లారీలు ఎలా వెళ్తున్నాయో చూడండి..


Elon Musk: అమెరికా టు ఢిల్లీ.. కేవలం 30 నిమిషాలు.. ఎలన్ మస్క్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 19 , 2024 | 08:54 AM