ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అర్జెంట్ అని వెళితే స్మార్ట్ టాయిలెట్ ఎంత పని చేసిందో చూడండి.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

ABN, Publish Date - Aug 04 , 2024 | 03:15 PM

ప్రస్తుతం ``స్మార్ట్`` యుగం నడుస్తోంది. మొబైల్ ఫోన్ల నుంచి చేతి గడియారాల వరకు, టీవీ నుంచి వంట పొయ్యిల వరకు ఎన్నో ఉపకరణాలు స్మార్ట్‌గా మారిపోయాయి. మన ప్రమేయం లేకుండా వాటంతట అవే టెక్నాలజీ సహాయంతో పనులు పూర్తి చేసేస్తుంటాయి.

Smart Toilet

ప్రస్తుతం ``స్మార్ట్`` (Smart) యుగం నడుస్తోంది. మొబైల్ ఫోన్ల నుంచి చేతి గడియారాల వరకు, టీవీ నుంచి వంట పొయ్యిల వరకు ఎన్నో ఉపకరణాలు స్మార్ట్‌గా మారిపోయాయి. మన ప్రమేయం లేకుండా వాటంతట అవే టెక్నాలజీ సహాయంతో పనులు పూర్తి చేసేస్తుంటాయి. ప్రస్తుతం స్మార్ట్ టాయిలెట్‌ల (Smart toilet)ను కూడా చాలా మంది వినియోగిస్తున్నారు. అయితే టెక్నాలజీ శృతిమించితే పరిస్థితి ఎలా ఉంటుందో వివరించే ఓ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తే కచ్చితంగా నవ్వుకోవాల్సిందే (Viral Video).


chineseteacher అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని వ్యక్తి వాష్‌రూమ్‌కు వెళ్లి మూత తెరవాలని స్మార్ట్ టాయిలెట్‌ను అడిగాడు. తాను టాయిలెట్‌ని ఉపయోగించాలనుకుంటున్నానని, దయచేసి మూత తెరవాలని స్మార్ట్ టాయిలెట్‌కు చెబుతాడు. అయితే ఆ కమాండ్ స్మార్ట్ టాయిలెట్‌కు సరిగ్గా అర్థం కాలేదు. దీంతో అది మూత తెరవకుండా అతడిని రకరకాల ప్రశ్నలు వేసింది. అర్జెంట్‌గా టాయిలెట్‌కు వెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తి అవస్థలు చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు.


ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను దాదాపు 20 లక్షల మంది వీక్షించారు. 2.2 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``టాయిలెట్ అలసిపోయినట్లు కనిపిస్తోంది``, ``పాపం.. ఆ వ్యక్తి టాయిలెట్‌తో పోరాడుతున్నాడు``, ``వెరీ ఫన్నీ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: తులం బంగారం ధర 1959లో ఎంతో తెలుసా? విపరీతంగా వైరల్ అవుతున్న పాత గోల్డ్ బిల్..!

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఆ బాలుడి సరదా ఓ మహిళ ప్రాణాలను ఎలా తీసిందో చూడండి..!


Viral Video: తమ్ముడూ.. ఇలా అయితే వధువు పారిపోతుందేమో.. పెళ్లిలో వరుడి తుఫాన్ డ్యాన్స్ చూడండి..!


Picture Puzzle: మీవి హెచ్‌డీ కళ్లు అయితే.. ఈ ఫొటోలో తేడాగా ఉన్న డబ్బుల సంచిని 10 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2024 | 03:15 PM

Advertising
Advertising
<