Viral: రాత్రంతా కారు కిటికీ తెరిచే ఉంచాడు.. మరుసటి రోజు కారులో ఏసీ ఆన్ చేస్తే భారీ షాక్!
ABN, Publish Date - Feb 17 , 2024 | 06:50 PM
రాత్రంతా కారు కిటీకి తెరిచి పెట్టిన వ్యక్తికి తెల్లారాక భారీ షాక్!
ఇంటర్నెట్ డెస్క్: ఇళ్లల్లోకి అప్పుడప్పుడూ పాములు రావడం అందరికీ తెలిసిందే. పెరట్లోనే, ఇంట్లోని కప్‌బోర్డులోనే, ఫ్యాన్లకు చుట్టుకునో అకస్మాత్తుగా దర్శనమిస్తూ గుండె పోట్లు తెస్తుంటాయి. కానీ, ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తికి ఇంతకంటే దారుణమైన అనుభవం ఎదురైంది. అసలేం జరిగిందో చెబుతూ అతడు నెట్టింట పంచుకున్న ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
Viral: ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!
మద్యం సేవించేటప్పుడు అస్సలు తినకూడని ఫుడ్స్ ఇవే!
ఆస్ట్రేలియా అంటేనే పాములు, తేళ్లు, సాలీళ్లు వంటి భయపెట్టే జీవాలకు ప్రసిద్ధి. మిగతాదేశాలతో పోలిస్తే అక్కడి వాతావరణం మరింత దడ పుట్టించేలా ఉంటుంది. ఆస్ట్రేలియాలో మాత్రమే ఉండే కొన్ని భారీ శాలీళ్లు ప్రపంచమంతా ఫేమస్. జనాలు వాటి పేరు చెబితేనే భయపడిపోతారు. అయితే, వాటిని నిత్యం చూసే ఆస్ట్రేలియన్లకు అవంటే అంత భయం ఉండదు. తాజా ఘటనలో మాత్రం ఆస్ట్రేలియా వ్యక్తే షాకైపోయాడు. ఇటీవల అతడు తన కుటుంబంతో కలిసి కారులో వెళుతూ ఏసీ ఆన్ చేశాడు. దీంతో, ఒక్కసారిగా బయటకొచ్చిన పాము అతడిని కాటేసే ప్రయత్నం చేసి లోపలికెళ్లిపోయింది. ఈ అనూహ్య పరిణామంతో కంగారు పడ్డ ఆ కుటుంబం వెంటనే కారును రోడ్డు పక్కన ఆపి కిందకు దిగిపోయింది.
Viral: ఛి ఛీ.. బాత్రూమ్‌లో అతడి డర్టీ పని చూసి మహిళకు షాక్.. అసలేం జరిగిందో తెలిస్తే..
ఆ తరువాత పాము మళ్లీ ఏసీ వెంట్స్ నుంచి తల బయటపెట్టడం చూసి ఆ కుటుంబం దిమ్మెరపోయింది. కాసేపు వాళ్లు అలాగే ఉండిపోయారు. ఈలోపు పాము కూడా మళ్లీ లోపలికి వెళ్లిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో వారు అదే కారులో ఏసీ ఆన్ చేయకుండా ప్రయాణించి ఇంటికి చేరుకున్నారు. రాత్రంతా కారు విండోను తెరిచి పెట్టడంతో మరునాటికల్లా అది వెళ్లిపోయింది. క్వీన్స్‌లాండ్‌లో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Feb 17 , 2024 | 06:54 PM