ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఓరి నాయనో.. రన్నింగ్ ట్రైన్‌లో కూడా పాము.. ఏసీ కోచ్‌లో ప్రత్యక్షమైన నాగరాజు.. ప్రయాణికుల కేకలు..

ABN, Publish Date - Sep 23 , 2024 | 08:28 AM

ఇటీవలి కాలంలో పాములు తరచుగా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇళ్లలోకి ప్రవేశించి ఏదో ఒక వస్తువులోకి దూరిపోతున్నాయి. వర్షా కాలం కావడంతో పాములు ఇలా జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ప్రజలు ఆయా ఘటనలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Snake was found in the AC coach of Garib Rath Express

ఇటీవలి కాలంలో పాములు (Snake) తరచుగా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇళ్లలోకి ప్రవేశించి ఏదో ఒక వస్తువులోకి దూరిపోతున్నాయి. వర్షా కాలం కావడంతో పాములు ఇలా జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ప్రజలు ఆయా ఘటనలను వీడియోలు (Snake Video) తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఓ పాము ఏకంగా ఏసీ ట్రైన్‌లోకే వచ్చేసి ప్రయాణికులను కంగారు పెట్టించింది (Viral Video).


సాధారణ రైళ్లోకి కాదు.. ఏకంగా గరీబ్‌రథ్‌లోకే ప్రవేశించి అందర్నీ భయపెట్టింది. జబల్‌పుర్‌ నుంచి ముంబై (Mumbai)కి వెళ్తున్న గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌ (Garib Rath Express) బయలు దేరింది. రైలు కాసర రైల్వే స్టేషన్‌ సమీపిస్తున్న వేళ ఏసీ కోచ్‌ జీ3లో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమైంది. బెర్త్‌ హ్యాండిల్‌కు చుట్టుకొని హంగామా చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అరుపులు, కేకలు పెట్టారు. భయంతో అందరూ కలిసి పక్క కోచ్‌లోకి వెళ్లిపోయారు. కొందరు ఆ పామును వీడియోలు తీశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఆ కోచ్‌లోకి ప్రవేశించి పామును బయటకు పంపేశారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివిధ సామాజిక మాధ్యమ ఖాతాల్లో షేర్ అయిన ఆ వీడియోకు విపరీతంగా వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. ఆ వీడియో చూసిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ``పాములు ప్రవేశించిన చోటు ఇంకేముంది``, ``ఏసీ కోచ్‌లోకి కూడా పాములు వచ్చేస్తే ఎలా``, ``ఆ పాము ఎప్పట్నుంచి అక్కడ ఉందో``, ``థాంక్ గాడ్.. ఎవరికీ ఏమీ జరగలేదు`` అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీవి డేగ కళ్లని అనుకుంటున్నారా?.. అయితే 10 సెకెన్లలో ఈ ఫొటోల కొవ్వొత్తిని వెతకండి..


Viral Video: ఓరి.. దేవుడో.. ఓ శివ భక్తుణ్ని నంది ఎలా దీవించిందో చూడండి.. వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే..


Viral Video: పలుసార్లు దాడి చేసిన కొండచిలువ.. ఎంతో ట్యాలెంట్‌తో తప్పించుకుని ఎలా పట్టుకున్నాడో చూడండి..


Viral Video: ఐకమత్యం లేకపోతే ఇలాగే ఉంటుంది.. కలిసి వేట.. తినే టైమ్‌లో గొడవ.. చివరకు ఏం జరిగిందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 23 , 2024 | 04:17 PM