Viral Video: పలుసార్లు దాడి చేసిన కొండచిలువ.. ఎంతో ట్యాలెంట్‌తో తప్పించుకుని ఎలా పట్టుకున్నాడో చూడండి..
ABN, Publish Date - Sep 22 , 2024 | 02:09 PM
ఈ ప్రపంచంలో పాములంటే భయపడని వారు చాలా అరుదుగా ఉంటారు. పామును పట్టుకునే నిపుణులు తప్ప సామాన్యులందరూ పాములంటే ఎంతగానో భయపడతారు. ఇక, భారీ ఆకారంలో ఉండే కొండచిలువను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి.
ఈ ప్రపంచంలో పాములంటే (Snake) భయపడని వారు చాలా అరుదుగా ఉంటారు. పామును పట్టుకునే నిపుణులు తప్ప సామాన్యులందరూ పాములంటే ఎంతగానో భయపడతారు. ఇక, భారీ ఆకారంలో ఉండే కొండచిలువను (Python) చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. అయితే కొద్ది మాత్రమే ఎంతో గుండె ధైర్యంతో పాములు, కొండచిలువలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. కొండచిలువను పట్టుకోవడానికి గుండె ధైర్యం మాత్రమే కాదు, గొప్ప టెక్నిక్ కూడా ఉండాలి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఎంతో చాకచక్యంగా భారీ కొండచిలువను పట్టుకున్నాడు (Viral Video).
@visualfeastwang అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ భారీ కొండచిలువను పట్టుకోవడానికి ఓ వ్యక్తి వెళ్లాడు. రోడ్డు మీద భారీ కొండచిలువను ఒట్టి చేతులతోనే పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ కొండ చిలువ అంత సులభంగా అతడికి చిక్కలేదు. పలుసార్లు అతడి మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. అతడి పైకి ఆగ్రహంతో దూకింది. అయితే ఆ వ్యక్తి చాకచక్యంగా ఆ కొండచిలువ దాడి నుంచి తప్పించుకున్నాడు. మూడో సారి ఆ కొండచిలువ దాడి చేయబోతుండగా ఆ వ్యక్తి దాని తల పట్టుకున్నాడు. దీంతో అది దొరికిపోయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోకు లక్షల్లో లైక్స్, వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఇది చాలా భయంకరంగా ఉంది``, ``కొండచిలువను చాలా కొద్ది మంది మాత్రమే పట్టుకోగలరు``, ``ఆ భారీ పైథాన్‌ను చూస్తేనే భయం వేస్తోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఐకమత్యం లేకపోతే ఇలాగే ఉంటుంది.. కలిసి వేట.. తినే టైమ్‌లో గొడవ.. చివరకు ఏం జరిగిందంటే..
Viral Video: షాకింగ్ వీడియో.. కళ్ల ముందే భూమిలోకి వెళ్లిపోయిన ట్రక్.. డ్రైవర్ ఎలా బయటపడ్డాడంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 22 , 2024 | 02:09 PM