ఏకాంతం... కొంత అవసరమే!
ABN, Publish Date - Dec 08 , 2024 | 08:48 AM
ఒంటరిగా ఉండటం వేరు... ఏకాంతంగా ఉండటం వేరు. ఉద్యోగం, కుటుంబం, స్నేహితులు, బంధువులు... అన్నింటికీ దూరంగా... వ్యక్తిగతంగా ఈ రోజుల్లో కాస్త ఏకాంతాన్ని దక్కించుకోవడం, కాస్త సమయాన్ని చేజిక్కించుకోవడం కష్టసాధ్యమే. ఎవరి కోసమో ఎదురుచూడకుండా... ఒక హోటల్‌లో కూర్చుని ‘టేబుల్ ఫర్ వన్... ప్లీజ్’ అనాల్సిందే... ఏకాంతం (దీన్నే సోలో డేటింగ్ అంటున్నారు) వల్ల చాలా లాభాలున్నాయి మరి...

సోలో ట్రిప్‌లు వేయడం, సింగిల్‌గా సినిమాకు వెళ్లడం... వంటివి కచ్చితంగా మీరు తీసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపుతాయంటున్నారు సైకాలజిస్టులు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, ఎవరి ప్రభావం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం అలవాటవుతుంది.
కొంత సమయం ఏకాంతంగా గడపడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. మనసు, మెదడు పునరుత్తేజం అవుతుంది.
సోలో డేటింగ్ వల్ల మరొకరిని ఒప్పించాల్సిన అవసరం ఉండదు. ఏ సినిమా చూడాలి? ఏ తిండి తినాలి? తదితర విషయాల్లో తికమకలుండవు. ఇతరత్రా డ్రామాలకు చోటుండదు. ఎవరేం అనుకుంటారోననే మొహమాటాలకు తావులేదు.
సోలో డేటింగ్ వల్ల సమస్యలన్నీ సమసిపోతాయని చెప్పలేం. కానీ మనల్ని మనం ప్రేమించుకునేందుకు తోడ్పడుతుంది.
సోలోగా... సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూడొచ్చు. స్పాకు వెళ్లొచ్చు. లైబ్రరీలో గడపొచ్చు. ఔట్‌డోర్ యోగా క్లాసు తీసుకోవచ్చు. పెయింటింగ్ వేయొచ్చు. బీచ్‌లో కూర్చోవచ్చు. సైకిల్ తీసుకుని నచ్చిన ప్రదేశానికి వెళ్లొచ్చు. కెమెరాతో ఫొటోలు తీయొచ్చు.
ఈ బిజీ ప్రపంచంలో మనల్ని మనం ప్రేమించుకుంటూ, కచ్చితంగా మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకోవడం అత్యవసరం. అంటే మీ కంపెనీనీ మీరే ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి.
రెస్టారెంట్‌లో ఏకాంతంగా కూర్చుంటే అందరి దృష్టి మీపై పడుతుందనుకుంటే... హెడ్‌ఫోన్స్ పెట్టుకోవచ్చు. దాంతో ఇతరులు మిమ్మల్ని డిస్ట్రబ్ చేయరు.
సోలో డేటింగ్ అనేది కేవలం బ్రహ్మచారులకే కాదు. ప్రతీ ఒక్కరికీ ఇది అవసరమే. నిజానికి రిలేషన్స్ నుంచి బ్రేక్ తీసుకోవడం అంటే అనుబంధాలకు రీసెట్ బటన్ నొక్కినట్టే. ఆలోచనలకు కొత్త చూపు ఇచ్చినట్టే.
ఏకాంతం ఎప్పుడూ విషాదంగా ఉండదు. విషాద సంగీతం, తక్కువ వెలుతురు, ఇరుకు గది... వీటిని ఒంటరితనంగా భావించాలి. ఏకాంతం అనేది మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది తేజోవంతంగా ఉంటుంది.
Updated Date - Dec 08 , 2024 | 08:48 AM